Telangana: పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూపర్ ఆఫర్..
సమాజంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్య ప్రధాన ఆయుధం. చిన్నతనం నుంచే విద్యార్థులకు విద్యపై మక్కువ పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పలు ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. ఉత్తమ మార్కులు సాధిస్తే.. విద్యార్థులకు ఇష్టమైన గిఫ్టులు ఇస్తామని హామీ ఇస్తుంటారు. కానీ ఓ జిల్లా కలెక్టర్ మాత్రం.. పదో తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ ఆఫర్ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

అతను జిల్లా పరిపాలనాధికారి.. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో బిజీగా ఉంటారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మిన అధికారి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తుంటారు. వారిని చదువుల్లో ప్రోత్సహించేందుకు వినూత్నంగా బంపర్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. అతను ఎవరో కాదు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు.
యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అనతి కాలంలోనే జిల్లా పాలనాధికారిగా తనదైన ముద్రను వేసుకున్నారు. నిత్యం పర్యటనలతో యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే.. పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో ఆయన జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తుంటారు. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదవ తరగతిలో పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన 70మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సిద్ధంగా ఉంచిన సైకిళ్లను కలెక్టర్ పరిశీలించారు.
యాదాద్రి జిల్లాలోని 192 ప్రభుత్వ పాఠశాలల్లో 6,074 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఇప్పటికే పరీక్షల సన్నద్ధత కోసం తలుపుతట్టు అనే వినూత్న కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. తాజాగా టెన్త్ లో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులకు సైకిల్ ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు. కష్టపడి చదవి మంచి మార్కులు సాధించాలని ఆయన విద్యార్థులను కోరారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
