AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్.. విచారణకు హాజరవ్వాలని నోటీసు..

సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన మీడియా కామెంట్స్‎ను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. గురువారం తెలంగాణ భవన్‎లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆగస్ట్ 15న ములుగులో మంత్రి సీతక్కచేసిన మాటలకు కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్.. విచారణకు హాజరవ్వాలని నోటీసు..
Ktr
Sravan Kumar B
| Edited By: |

Updated on: Aug 16, 2024 | 9:33 PM

Share

సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన మీడియా కామెంట్స్‎ను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. గురువారం తెలంగాణ భవన్‎లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆగస్ట్ 15న ములుగులో మంత్రి సీతక్కచేసిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. మహిళలు బస్సుల్లో వెల్లుల్లి ఏరుతూ ప్రయాణం చేయటానికి ఉచితపస్సు సౌకర్యం కల్పించారని తెలియక ఇన్ని రోజులు ఉన్నామంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అవసరమైతే మహిళలకి ఉచితంగా మనిషికో బస్సు పెట్టండి అన్నారు. అదే క్రమంలో అవసరమైతే కుట్లు అల్లికలు, రికార్డింగ్ బ్రేక్ డాన్స్ ఇలా వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అన్నారు. దీనిపై మంత్రి సీతక్క మండిపడ్డారు.

ఈ కామెంట్స్ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అవమానకరమైన వ్యాఖ్యలుగా భావించిన మహిళా కమిషన్ దీనిపై కేసునమోదు చేసింది. తెలంగాణలోని అసంఖ్యాక మహిళా సమాజానికి సంబంధించిన అంశం అని పేర్కొంది. కేటీఆర్ వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళలను బాధ కలిగించాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం ప్రకారం సూమోటోగా విచారణను ప్రారంభించింది. అందులో భాగంగా శుక్రవారం మహిళా కమిషన్ కేటీఆర్‎కు నోటీసులు పంపించినట్టుగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

ఈనెల 24న కమిషన్ ముందుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. అయితే గురువారం కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఉదయం ఇదే ఎక్స్ ద్వారా స్పందించారు. కేవలం యధాలాపంగా మాత్రమే తాను అలా మాట్లాడానని పేర్కొన్నారు. పార్టీ మీటింగ్ లో మహిళల పట్ల మాట్లాడిన వ్యాఖ్యల వల్ల మహిళ సోదరీమణులకు అవమానం కలిగితే దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నానంటూ ఒక సందేశాన్నా ఇచ్చారు. తన అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎన్నడూ లేదంటూ రాసుకొచ్చారు. అయితే మహిళా కమిషన్ మాత్రం దీనిపై విచారణ జరపాలని భావించింది. 24 వ తారీకు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారు, విచారణకు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..