Telangana: సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రియుడిపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే..

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. అనంతరం ఎవరు చంపారో అంటూ అందరిముందు నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేసింది.. చివరకు ఖాకీలు రంగంలోకి దిగి తమదైన స్టైల్ లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

Telangana: సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రియుడిపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే..
Illegal Affair
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 24, 2024 | 9:17 PM

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. అనంతరం ఎవరు చంపారో అంటూ అందరిముందు నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేసింది.. చివరకు ఖాకీలు రంగంలోకి దిగి తమదైన స్టైల్ లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామానికి చెందిన వడ్డెర పర్వతాలు, ఆయన భార్య అనసూయ స్థానిక చౌరస్తాలో టీ హోటల్ నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీ హోటల్ దుకాణానికి దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్ లో పనిచేసే వ్యక్తి కమ్మరి బాలరాజు తో అనసూయకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఇక తరచూ మనస్పర్థలతో గొడవపడుతున్న భర్త పర్వతాలును అంతమొందించాలని డిసైడ్ అయ్యింది అనసూయ. ప్రియుడికి విషయం చెప్పడంతో ఇద్దరు కలిసి భర్త హత్యకు ప్రణాళిక రచించారు. ఈ నెల 18న రాత్రి గం.9.30 నిమిషాలకు మద్యం తాగుదామని చెప్పి పర్వతాలును ఓ నిర్మానుష్య వెంచర్ లోకి తీసుకెళ్లాడు బాలరాజు. పర్వతాలు మద్యం మత్తులోకి వెళ్లాక గొడ్డలితో నరికి కిరాతకంగా హత్యచేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

తన భర్తను కొంత మంది టార్గెట్ చేశారని వాళ్ళ పైనే అనుమానం ఉందని అందరినీ తప్పుదోవ పట్టించింది భార్య అనసూయ. తనకు ఇద్దరు కూతుళ్ళతో ఎలా బ్రతకాలో తెలియడం లేదని నమ్మబలికింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఇక కేసు దర్యాప్తులో భాగంగా పర్వతాలు భార్య అనసూయ కాల్ డేటాను పరిశీలించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఘటన జరిగిన రోజు బాలరాజు ఆమెకు ఫోన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు..

అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యానేరాన్ని బాలరాజు ఒప్పుకున్నాడు. దీంతో పర్వతాలు హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడితో భార్యే పర్వతాలను హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. దీంతో అనసూయ, బాలరాజు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..