Telangana: చెరువుల్లో నిర్మాణాలపై HMDAకు హైడ్రా లేఖ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేతను మరింత వేగవంతం చేస్తోంది. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలపై HMDAకు హైడ్రా కమిషనర్ లేఖ రాసింది. ఎఫ్‌టీఎల్ లేదా బఫర్‌లో నిర్మాణాలకు పర్మిషన్ రద్దుచేయాలని లేఖలో కోరారు. అనుమతులను మరోసారి..
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేతను మరింత వేగవంతం చేస్తోంది. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలపై HMDAకు హైడ్రా కమిషనర్ లేఖ రాసింది. ఎఫ్‌టీఎల్ లేదా బఫర్‌లో నిర్మాణాలకు పర్మిషన్ రద్దుచేయాలని లేఖలో కోరారు. అనుమతులను మరోసారి రీ వెరిఫై చేయాలని సూచించారు. కోమటికుంటతో పాటు 5 చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయాలని కోరారు.
మరోవైపు ఆక్రమణల కూల్చివేతల అంశంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలోని నాలుగు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది.
సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు:
ఇదిలా ఉండగా, చెరువులు, నాలాల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ఔటర్ లోపలి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Water Heater: శీతాకాలంలో మీకు ఎలాంటి వాటర్ హీటర్ ఉత్తమం? ఎంత కెపాసిటి ఉంటే మంచిది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి