Aroori Ramesh: ఆరూరి దారెటు..? ఆయన బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? కమలం పువ్వు అందుకుంటారా?

పార్లమెంట్ ఎన్నికల వేల వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం ఊహించని హైడ్రామాకు దారి తీసింది. ఒక్కసారిగా ఓరుగల్లులో ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడానికి డిసైడ్ అయిన ఆరూరి రమేష్ ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిశారు. మంగళవారం సాయంత్రం కేంద్ర

Aroori Ramesh: ఆరూరి దారెటు..? ఆయన బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? కమలం పువ్వు అందుకుంటారా?
Aroori Ramesh
Follow us
G Peddeesh Kumar

| Edited By: Subhash Goud

Updated on: Mar 13, 2024 | 6:51 PM

పార్లమెంట్ ఎన్నికల వేల వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం ఊహించని హైడ్రామాకు దారి తీసింది. ఒక్కసారిగా ఓరుగల్లులో ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడానికి డిసైడ్ అయిన ఆరూరి రమేష్ ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిశారు. మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.. ఈ రోజు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి, కాషాయ కండువా కప్పు కోవడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి అభిప్రాయాన్ని ప్రకటించడానికి సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే అచ్చం సినీ ఫక్కీలో ఊహించని హై డ్రామా చోటుచేసుకుంది. అప్పటికే ఆరూరి రమేష్ తో హరీష్ రావు ఫోన్లో మంతనాలు చేస్తున్నారు

ప్రెస్ మీట్ కు సిద్ధమౌతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బస్వరాజు సారయ్య, మాజీ కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కొంతసేపు మంతనాలు జరిపి అక్కడి నుండి ఆరూరి రమేష్ ను వారి వెంట తీసుకెళ్లారు.. ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనం లో ఆయన తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆరూరి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆరూరి రమేష్ ను తీసుకువెళ్తున్న వాహనాన్ని ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లారు మార్గమధ్యలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హైదరాబాద్ – వరంగల్ మధ్య జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆరూరి రమేష్ ను తీసుకు వెళ్తున్న వాహనాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. అరూరి రమేష్ ను కారులో నుండి బయట గుంజే క్రమంలో ఆయన చొక్కా చినిగిపోయింది.

వారికి నచ్చ చెప్పి తిరిగి అదే వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో మరోసారి భువనగిరి వద్ద ఆరూరి రమేష్ ను తీసుకెళ్తున్నావాహనని బిజెపి శ్రేణులు అడ్డుకున్నారు వారికి కూడా నచ్చజెప్పి ఆయన హైదరాబాదులోని కేసీఆర్‌ నివాసానికి తీసుకెళ్లారు. అయితే ఆరూరి రమేష్ ను వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దింపడానికి బీజేపీ కసరత్తు చేస్తుంది. బీజేపీ నేతలు ఇప్పటికే ఆయనకు వరంగల్ పార్లమెంట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.  బీఆర్ఎస్ లో కొంతమంది నేతలతో ఆరూరికి పొసకడం లేదు.. ఈ క్రమంలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోవడానికి దాదాపుగా డిసైడ్ అయిపోయారు.. ఆయన ఇంటి వద్ద ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను కూడా తొలగించారు. జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ ను కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. మరి ఆయన నిర్ణయం ఏ విధంగా ఉండ బోతోంది..? కేసీఆర్‌ ఏం హామీ ఇస్తారు..? ఆరూరి బీఆర్ఎస్ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా..? లేక బీజేపీ గూటికి చేరి వరంగల్ పార్లమెంటు నుండి అభ్యర్థిగా దిగుతారా..? అనే చర్చ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర