జామపండులో విటమిన్ సి, లైకోపీన్ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.
జామలో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకూడదని అంటే జామ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
జామ కాయలో మెగ్నీషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపు చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా జామ ఉపయోగపడుతుంది. ఇదులోని ఫైబర్ కంటెంట్ అన్ని రకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
కంటి సంబంధిత సమస్యల రాకుండా ఉండాలంటే జామ కాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జామపండు తియ్యగా ఉన్నా షుగర్ పేషెంట్స్‌కి మంచిదేనని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది.
జామపండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను దరిచేరనివ్వకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా జామను తీసుకోవాలని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.