Animals: తెలుగు రాష్ట్రాల్లో వన్యప్రాణుల అలజడి.. అడవులను వీడి జనావాసాల్లోకి వస్తున్న క్రూరజంతువులు..
తెలుగు రాష్ట్రాల ప్రజలు వన్యప్రాణుల అలజడితో వణిపోతున్నారు. చిరుత, పెద్ద పులుల సంచారంతో భయందోళన చెందుతున్నారు ప్రజలు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు వన్యప్రాణుల అలజడితో వణిపోతున్నారు. చిరుత, పెద్ద పులుల సంచారంతో భయందోళన చెందుతున్నారు ప్రజలు. అడవులను దాటి ఊర్లలోకి వస్తుండటంతో బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నా అటవీ సమీప ప్రాంత ప్రజలు. ఎలుగుబంటి, ఏనుగుల మంద, పులులు, చిరుత పులులు ఇలా భయంకరమైన జీవులన్నీ జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు.
తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో చిరుత కలకలం రేపింది. కుక్కపై దాడి చేసి చంపేసింది. చిరుత కుక్కపై దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు ఇల్లందు డిఎస్పి రమణ మూర్తి, ఫారెస్ట్ అధికారులు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను అమర్చారు ఫారెస్ట్ అధికారులు. సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రవంతంగా ఉండాలని సూచించారు అధికారులు. పులి కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని డిఎస్పీ సూచించారు.
ఆదిలాబాద్‌లో..
బుధవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో పులులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. భీంపూర్ మండలం తాంసి(కె) శివారులోని ప్రాజెక్టు దగ్గర టిప్పర్ డ్రైవర్ కంట పడ్డాయి పులుల జంట. వెహికల్స్ దగ్గరగా వచ్చిన జంట పులులను డ్రైవర్ సెల్ ఫోన్ లో బంధించారు. పదేపదే ప్రాజెక్టు దగ్గర పులులు సంచరించడంతో కార్మికులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోనూ..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుడిబండ గ్రామంలో చిరుత సంచారం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. పట్టపగలే గ్రామం మధ్యలో ఉన్న కొండపై కనపించింది చిరుత. చిరుత ఎప్పుడు అటాక్ చేస్తుందోనని భయపడిపోతున్నారు స్థానికులు. చిరుత నుంచి ప్రాణహాని లేకుండా కాపాడాలని అధికారులను మోర పెట్టుకుంటున్నారు స్థానికులు.
మన్యంలో..
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం నరసాపురంలో రెండు చిరుత పులులు అలజడి సృష్టించాయి. స్థానికుల సమచారంతో చిరుతల పాదముద్రలు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. కన్నారం శివారు నుండి ఆముదాల బంధ శివారు వరకు నడిచి వెళ్లినట్లు గుర్తించారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..