Telangana: కౌన్‌ బనేగా తెలంగాణ పోలీస్‌ బాస్‌.. డీజీపీ రేసులో ఆ నలుగురు?

|

Dec 08, 2023 | 6:31 AM

కొత్త సర్కార్‌ కొలువుదీరే వేళ కొత్త డీజీపీ ఎవరనే చర్చ జోరందుకుంది. ఇంచార్జ్‌ డీజీపీ రవిగుప్తనే కొనసాగిస్తారా? ఈసీ సస్పెన్షన్‌ వేటుతో సైడయిన అంజనీకుమార్‌ విషయంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. డీజేపీ రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి .

Telangana: కౌన్‌ బనేగా తెలంగాణ పోలీస్‌ బాస్‌.. డీజీపీ రేసులో ఆ నలుగురు?
Telangana State Police
Follow us on

కొత్త సర్కార్‌ కొలువుదీరే వేళ కొత్త డీజీపీ ఎవరనే చర్చ జోరందుకుంది. ఇంచార్జ్‌ డీజీపీ రవిగుప్తనే కొనసాగిస్తారా? ఈసీ సస్పెన్షన్‌ వేటుతో సైడయిన అంజనీకుమార్‌ విషయంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. డీజేపీ రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి . రవిగుప్త.. జితేందర్‌, సీవీ ఆనంద్‌, రాజీవ్‌రతన్‌..ఈ నలుగురిలో డీజీపీ ఛాన్స్‌ దక్కేదవరికి? ఈ నలుగురిలో ఒకరికా లేదంటే కొత్త సర్కార్‌ నిర్ణయంతో కొత్తగా మరో పేరు తెరపైకి రానుందా? అనే చర్చ జరుగుతోంది. రవిగుప్త 1990 IPS బ్యాచ్‌. ప్రస్తుతంఇంచార్జ్‌ డీజీపీగా కొనసాగుతున్నారాయన. ఎల్‌బినగర్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రి ఢిల్లీ నుంచి బేగంపేటకు చేరుకున్న రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలికారు. కాన్వాయ్‌ సహా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లు-భద్రతపై ఐపీఎస్‌ శివధర్‌ రెడ్డితో కలిసి రేవంత్‌ రెడ్డితో చర్చించారు. కోడ్‌ ఉల్లంఘన కింద డీజీపీ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేయడం.. ఇమ్మిడియేట్‌ సీనియర్‌గా రవిగుప్తను ఇంచార్జ్‌ డీజీపీ నియమించడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన పూర్తి స్థాయిలో యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చారు. సీఎస్‌ శాంతకుమారి సహా పలువురు అధికారులతో కలిసి ఎల్‌బిస్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లు-భధ్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షించారు ఇంచార్జ్‌ డీజీపీ రవిగుప్త . సీఎం రేవంత్‌ ప్రమాణోత్సవానికి వీఐపీలు రావడంతో స్టేడియం దగ్గర భద్రతపై ప్రదానంగా ఫోకస్‌ పెట్టారు రవిగుప్త. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించి ప్రమాణ స్వీకార సభను సక్సెస్‌ చేశారు.

మరి ఇంచార్జ్‌ డీజీపీగా వున్న రవిగుప్తనే రేవంత్‌ సర్కార్‌ డీజీపీగా కొనసాగిస్తుందా? లేదంటే కాంగ్రెస్‌ మార్క్‌ ప్రకారం మార్పు అనివార్యమవుతుందా? తెలంగాణ కొత్త డీజీపీ ఛాన్స్‌ ఎవరికి? రేసులో రవిగుప్తతో పాటు జితేందర్‌, సీవీ ఆనంద్‌, రాజీవ రతన్‌ పేర్లున్నాయి. రవిగుప్తది 1990 బ్యాచ్‌.. సీవీ ఆనంద్‌ 1991 బ్యాచ్‌.. హైదరాబాద్‌ సీపీ వున్నా ఆయన ఎన్నికల టైమ్‌లో ఈసీ ఆదేవాలతో బదిలీలో ఉన్నారు. 1991బ్యాచ్‌కు చెందిన మరో ఐపీఎస్‌ రాజీవ్‌ రతన్‌. ప్రస్తుతం ఆయన హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వున్నారు. ఇక 1992 బ్యాచ్ కు చెందిన జితేందర్. ప్రస్తుతం హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను కూడా కొత్త ప్రభుత్వం మారుస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక ఎన్నికల కమిషన్ సస్పెండ్‌ చేసిన డీజీపీ అంజనీ కుమార్ భవిష్యత్తు కూడా కొద్ది రోజుల్లో తేలనుంది. కొత్త డీజీపీ సహా పోలీస్‌ శాఖలో కీలక పదవుల విషయంలో రేవంత్‌ సర్కార్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..