Khammam: ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎవరు..? రోజుకో పేరు తెరపైకి.. కేడర్‌లో అయోమయం!
ఖమ్మం భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరు..? రాష్ట్రంలో అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించినా.. ఖమ్మం, వరంగల్ సీట్లకు పెండింగ్‌లో బీజేపీ అధిష్టానం పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు టికెట్ ఖరారు అయ్యిందని ప్రచారం జరిగింది. టికెట్ హామీతోనే బీజేపీలో చేరారని అంటున్నారు.

ఖమ్మం భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరు..? రాష్ట్రంలో అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించినా.. ఖమ్మం, వరంగల్ సీట్లకు పెండింగ్‌లో బీజేపీ అధిష్టానం పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు టికెట్ ఖరారు అయ్యిందని ప్రచారం జరిగింది. టికెట్ హామీతోనే బీజేపీలో చేరారని అంటున్నారు. కానీ చివరి క్షణంలో పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కీలక నేత వస్తే అతనికి ఖరారు అవుతుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఖమ్మం బీజేపీలో రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. అసలు టికెట్ ఎవరికి వస్తుంది..? ఎవరు పోటీ చేస్తారో అనే కన్ఫ్యూజన్‌లో ఉంది పార్టీ కేడర్.
తెలంగాణలో అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే ఖమ్మం ,వరంగల్ రెండు స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ప్రకటించలేదు. ఖమ్మం అభ్యర్థిపై రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. దీనితో కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు టికెట్ ఖరారు అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే ఆఖరి క్షణంలో జాబితాలో ఆయన పేరు ప్రకటించకపోవడంతో షాక్ గురయ్యారు. ఇలోపు మరో బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేత ఒకరు కషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని, ఖమ్మం నుంచి పోటీ చేస్తారని, అందుకే పెండింగ్ లో పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఆ నేత కోసం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీనితో టికెట్ ఇస్తామని హామీతో బీజేపీలో చేరిన జలగం వెంకటరావుకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలను కలిసి టికెట్‌పై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు జిల్లా బీజేపీ నేతలు గల్లా సత్యనారాయణ, దేవకి వాసుదేవ రావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, వినోద్ రావులు ఖమ్మం నుంచి టికెట్ రేసులో ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మాలో ఎవరికీ టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అనూహ్యంగా జలగం వెంకటరావు బీజేపీలో చేరి టికెట్ రేసులోకి రావడంతో దాదాపుగా ఆయనకే వస్తుందని అంతా భావించారు. జలగం వెంకటరావు టికెట్ తనకే నన్న ధీమాతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలో మరో పేరు తెరపైకి వచ్చింది.
ఖమ్మం జిల్లాలో సామాజిక సమీకరణాలు కోణంలో బలమైన కమ్మ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు ఆ దిశగా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నామా నాగేశ్వరరావు స్పందించ లేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా పోటీ చేస్తారని ధీమాతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో టికెట్ వ్యవహారం రోజుకో పేరు తెరమీదకు వస్తూ మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకూ రేసులో ఉన్న వారే కాకుండా ఇంకా ఇతర నేతలు తెర మీదకు వచ్చే అవకాశం ఉందని, ఏమి జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు పార్టీ నేతలు. ఈ క్రమంలోనే ఖమ్మం బీజేపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. మరి అభ్యర్థి ఎవరు అనేది.. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చి ప్రకటిస్తారా.. లేదా..? చూడాలి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…