Assembly Election: ఈవీఎంలు ఎక్కడ.. అభ్యర్థులు రీకౌంటింగ్ కోరితే అధికారులు చర్యలేంటి.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం సైతం కొలువుదీరింది. అంతా బాగానే ఉన్నా, ఓట్ల లెక్కింపుపై మళ్లీ ఏమైనా అభ్యంతరాలు వస్తే? రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటీ? అధికారులు ఏం చేస్తారు? ఎన్నికల ప్రక్రియ పూర్తైనా డేటా ఉంటుందా? ఈవీఏంల పరిస్థితి ఏంటీ? వీటన్నింటికి సమధానాలు చూద్దాం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం సైతం కొలువుదీరింది. అంతా బాగానే ఉన్నా, ఓట్ల లెక్కింపుపై మళ్లీ ఏమైనా అభ్యంతరాలు వస్తే? రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటీ? అధికారులు ఏం చేస్తారు? ఎన్నికల ప్రక్రియ పూర్తైనా డేటా ఉంటుందా? ఈవీఏంల పరిస్థితి ఏంటీ? వీటన్నింటికి సమధానాలు చూద్దాం.
శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చిన ముఖ్యమైన సమాచారాన్ని, యంత్రాలను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు అధికారులు. పోలింగ్‌లో ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లతో పాటు పలు విలువైన పత్రాలను ఐదేళ్ల వరకు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. వీటన్నింటిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచి సీల్ చేస్తారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడించిన నాటి నుంచి 45రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారి అధ్వర్యంలో భద్రత కల్పిస్తారు. ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం అధికారులు స్ట్రాంగ్ రూంలలో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తారు. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తాయి. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘానికి అప్పగించి గోదాములకు తరలిస్తారు. ఇక అక్కడ మళ్లీ ఎన్నికల వరకు అంటే ఐదేళ్ల పాటు భద్రంగా నిల్వ చేస్తారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆయా యంత్రాల్లో డేటాను తొలగించి ఎన్నికల సంఘం అవసరానికి అనుగుణంగా దేశంలో ఎక్కడైనా తిరిగి మళ్లీ ఉపయోగించుకుంటారు.
ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత గెలిచిన అభ్యర్థులపై ఓడిపోయిన అభ్యర్థులు ఐదేళ్లలో ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, లేదంటే రీకౌంటింగ్ కు జరిపించాలని ఎవరైన అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు. అభ్యర్థుల మధ్య ఎన్నిక పోటాపోటీగా జరిగినప్పుడు గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లు కీలకంగా మారుతాయి. స్వల్పఓట్ల తేడాతో ఓడిన అభ్యర్థులు ఎప్పుడైనా ఓట్ల లెక్కింపును మళ్లీ కోరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏ నియోజకవర్గంలో ఫిర్యాదు అందితే దానికి సబంధించిన కంట్రోల్ యూనిట్ లో ఓట్లను తక్షణమే లెక్కించేందుకు వీలుగా అధికారులు ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించిన యంత్రాలను భద్రపరుస్తున్నారు. కోర్టు లేదా ఎన్నికల సంఘం అదేశాలను అనుసరించి నిబంధనల మేరకు ఈ రీకౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…