Telangana: ఆదిలాబాద్ యువతపై సైబర్ వల.. తొలుత మిస్డ్ కాల్.. ఆపై న్యూడ్ వీడియోలతో..
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడు వేశారు. అయితే న్యూడ్ వీడియో కాల్స్ ముసుగులో చివరకు లాయర్లు చిక్కకోవడంతో ఒక్కసారిగా విషయం బయటకు వచ్చింది.
మిస్డ్ కాల్ ఇస్తారు.. కవ్వింపులతో ముగ్గులోకి దించుతారు.. న్యూడ్‌గా వీడియో కాల్స్ చేస్తారు. ఆ వీడియోలను లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇది ఆదిలాబాద్‌లో కొంతమంది బాధితులకు జరిగిన కథ. అసలు ఈ న్యూడ్ కాల్స్ కథేంటో ఇప్పుడు చూద్దాం.. యూత్ టార్గెట్‌గా ఆన్‌లైన్‌లో యువతులు మోసాలకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తికి మిస్‌కాల్‌తో పరిచమైంది ఓ అమ్మాయి. ఆ పరిచయం కాస్త పెరిగి రోజూ వీడియో కాల్స్ నుంచి న్యూడ్ వీడియో కాల్స్ వరుకు వెళ్లింది. అవి రికార్డ్ చేసిన ఆమె.. తన అసలు రంగు బయటపెట్టింది. ట్విస్ట్ లమీద ట్వీస్ట్ లు ఇచ్చింది. న్యూడ్ వీడియో కాల్స్ ముసుగులో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టింది ఆ అమ్మాయి.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడు వేశారు. అయితే న్యూడ్ వీడియో కాల్స్ ముసుగులో చివరకు లాయర్లు చిక్కకోవడంతో ఒక్కసారిగా విషయం బయటకు వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయపోయిన పదేపదే చేసి విసిగిస్తున్నారని చెప్పారు. జస్ట్ ఒక్కసారి లిఫ్ట్ చేసిన పాపానికి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని బాధితులు చెప్పుకొచ్చారు.
వీడియో కాల్స్ ముసుగులో బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బ్లాక్ మెయిల్ దందాపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రంగంలోకి దిగి, వివరాలు ఆరా తీస్తున్నారు.