AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: ఎందుకీ మౌనం..? గులాబీ దళపతి కేసీఆర్‌ స్ట్రాటజీ ఏంటి.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ!

కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో మౌనానిది కీలక పాత్ర. ఆయన కీలకమైన విషయాల్లో మౌనంగా ఉంటారు. సరైన సమయం చూసి ఎంటర్ అవుతారు. మరి ఇన్ని ఇష్యూస్‌ ఉన్నా కేసీఆర్ రియాక్ట్‌ కాకపోవడానికి కారణం ఏంటి..? అధికార పార్టీకి టైమ్‌ ఇస్తున్నారా..? సమయం కోసం ఎదురు చూస్తున్నారా..? కేసీఆర్‌ సైలెన్స్‌ను కాంగ్రెస్‌ క్యాష్‌ చేసుకుంటుందా..?

KCR: ఎందుకీ మౌనం..? గులాబీ దళపతి కేసీఆర్‌ స్ట్రాటజీ ఏంటి.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ!
BRS Chief KCR
Shaik Madar Saheb
|

Updated on: Oct 12, 2024 | 1:25 PM

Share

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ జనానికి కనిపించి చాలా రోజులైపోయింది. ఆ మధ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ రోజు సభకు హాజరయ్యారు అంతే. జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్, లీడర్లతో అప్పుడప్పుడు ఫాంహౌస్‌లోనే సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు కేసీఆర్. ఎవరైనా ముఖ్యనేతలు కలవాలన్నా ఫాంహౌస్‌కే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం రగులుతోంది. రైతు రుణమాఫీపైనా అధికార, విపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. ఓవైపు హైడ్రా మంటలు.. మరోవైపు మూసీ ప్రక్షాళనపై ఆందోళనలతో రాజకీయం వేడెక్కింది. అయినా కేసీఆర్‌ బయటకు రావడం లేదు. ప్రభుత్వం వైఫల్యాలపై ఎలా ముందుకెళ్లాలో కూడా కేడర్‌కు దిశానిర్దేశం కూడా చేయలేదు. అంతేకాదు ఆ మధ్యం తెలంగాణలో భారీ వరదలు ముంచేత్తిన సమయంలోనూ కేసీఆర్‌ జనం మధ్యకు రాలేదు. కౌశిక్‌ రెడ్డి ఇష్యూ జరిగినా కేసీఆర్‌ మౌనం వీడలేదు. ఈవన్నీ అంశంలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావే మాట్లాడుతున్నారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోనే ఉంటున్నారు. కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రెస్‌నోట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రావట్లేదని రాజకీయాల్లో చర్చ జరగుతోంది. ఇప్పుడు దీన్ని క్యాష్‌ చేసుకుంది అధికార కాంగ్రెస్‌ పార్టీ. కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం కావడంపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే అధికార పార్టీ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తోంది బీఆర్‌ఎస్‌. కేసీఆర్‌కి ఎప్పుడు ప్రజల్లోకి రావాలో తెలుసంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ యాక్టివ్‌ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయా?

ఇన్ని ఇష్యూస్‌ ఉన్నా కేసీఆర్ రియాక్ట్‌ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటివరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో జరిగిన మేలేంటో..నష్టమేంటో ప్రజలకే అర్థం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఏడాది సమయం ఇచ్చి విమర్శించినా ప్రజలు రిసీవ్‌ చేసుకునే పరిస్థితి ఉంటుందని.. ఆలోపే ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయొద్దని గులాబీ బాస్ అనుకుంటున్నారట. అయితే మంచి అవకాశాల్ని కోల్పోతున్నామన్న భావన మాత్రం కొంత మంది బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. మరి ఏడాది తర్వాత గులాబీ దళపతి ఫీల్డ్‌లోకి దిగుతారా..? చూడాలి ఏం జరుగుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..