AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమ్మో సంక్రాంతి “కీడు”.. ఆ తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజుల గండం..

ఈ సంక్రాంతి పండుగను కొత్త కీడు గండం పరేషాన్ చేస్తుంది.. పండగ వేల నెట్టింట్ల కొత్త పుకార్లు షికార్లు చేస్తుండడంతో కొందరు తల్లులు గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు.. అదేదో కీడు భయంతో ఆ తల్లులు గాజుల దుకాణాల ముందు క్యూ కడుతున్నారు.. ఇంతకీ ఏంటా గాజుల గండం..? వేద పండితులు ఏమంటున్నారు..? ఎందుకు ఆ తల్లులు పరుగులు పెడుతున్నారు.? సోషల్ మీడియా పుణ్యాన అగమగమవుతున్న ఆ తల్లుల తల్లాటకు కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Telangana: అమ్మో సంక్రాంతి కీడు.. ఆ తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజుల గండం..
Sankranti Gaajula Gandam
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 09, 2024 | 12:53 PM

Share

వరంగల్, జనవరి 09: అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా వింత ఆచారాలు, మూఢ నమ్మకాల జాడ్యం ఇంకా వీడడం లేదు… అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సోషల్ మీడియా ప్రచారాలు వూహించని విధంగా ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. పండుగలు వస్తున్నాయంటేచాలు ఏదో ఒక వింత ప్రచారాలు జనాన్ని పరేషాన్ చేస్తూ.. పరుగులు పెట్టిస్తున్నాయి.. తాజాగా ఈసారి సంక్రాoతి పండుగను గాజుల గండం దడ పుట్టిస్తుంది.. ఊహించని విధంగా మహిళలు గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్… త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేల కొత్త పుకార్లు జోరందుకున్నాయి.. ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్ద డబ్బులు అడుక్కొని గాజులు వేసుకోవాలని ప్రచారం జరుగుతుంది…

ఈ ప్రచారం ఇప్పటికే పల్లెలు, పట్టణాలన్నా తేడాలేకుండా ప్రతీ ఇంటికీ చేరింది.. ఇంకేముంది… ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకున్న తల్లులు పరుగులు పెడుతున్నారు.. వారి వద్ద డబ్బులు తీసుకొని గాజులు వేసుకొని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు… ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు కీడు వచ్చిందని… అందు కోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువమంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని.. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని ప్రచారం జరుగుతుంది.. సంక్రాంతి పండగ లోపు ఐదు రకాల గాజులు ధరించాలని..లేకుంటే కీడు తప్పదని ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది..

ఆ కీడు ధరికూడదని తల్లడిల్లిపోతున్న తల్లులు ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. విద్యావంతులు కూడా కీడు భయంతో ఇదే ఆచరిస్తున్నారు.. పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని ఆచరించాల్సిందే అంటున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మవద్దని వేద పండితులు, పురోహితులు సూచిస్తున్నారు.. పండుగలకు కీడు వస్తుందని.. ఇలాంటి గాజులు ధరిస్తే ఆ కీడు పోతుందని ఏ శాస్త్రంలో లేదని కొట్టి పారేస్తున్నారు.. ఇలాంటి ప్రచారాలతో ప్రజలను పరేషాన్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తం మీద గాజుల గండం….కీడు భయంతో గాజులు మాత్రం మస్త్ గిరాకీ పెరిగింది…

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్