Watch Video: మెట్రో ప్రయాణంలో జాగ్రత్త..! ఇటువంటి సంఘటన మీకు జరగొచ్చు..

మెట్రో డోర్‌ దగ్గర నిలబడిన ఓ యువతి తన ఫోన్‌లో ఏదో చూస్తుంది...అంతలోనే బయట ప్లాట్‌ఫామ్‌పై నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఆమెను గమనిస్తున్నాడు.. మెట్రో తలుపు మూసుకునే సమయానికి ఆ వ్యక్తి మెట్రోలో ఉన్న అమ్మాయి చేతిలో ఫోన్‌ లాగేసుకున్నాడు..అంతలోనే మెట్రో తలుపులు మూసుకున్నాయి.. ట్రైన్‌ వెళ్లిపోతుంది.. ఆమె ఎంతగా అరిచినా, గోల చేసినా లాభం లేకపోయింది.. అతడు మాత్రం హాయిగా ఆ అమ్మాయి ఫోన్‌ లాగేసుకుని నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకున్నాడు..

Watch Video: మెట్రో ప్రయాణంలో జాగ్రత్త..! ఇటువంటి సంఘటన మీకు జరగొచ్చు..
Traveling In Metro Be Alert
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2024 | 10:02 AM

ఉదయం నిద్రలేచింది మొదలు..రాత్రి పడుకునే వరకు మనమందరం నిత్యం ఏదో ఒక విధంగా మన ఫోన్‌లకు కనెక్ట్ అయి ఉంటాము. చాలా మందికి ఫోన్ లేకుండా జీవించడం కష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ నిత్యం ఫోన్‌ వాడే అలవాటు ఉంది. ఇది మిమ్మల్ని ఫోన్‌లు, ఇతర డిజిటల్ పరికరాల నుండి దూరంగా ఉండాలేనంత కష్టతరం చేసింది. ప్రతి ఒక్కరూ ఫోన్‌కి కనెక్ట్‌ అయిపోయారు. ఇంట్లో, బయట, ప్రయాణాల్లోనూ ఫోన్‌లోనే లీనమైపోతుంటారు చాలా మంది.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువతి మెట్రోలో తన ఫోన్‌ని చూస్తూ బిజీగా ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె ఫోన్ లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే…

వీడియోలో…ముందుగా మెట్రో ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చింది.. దాని తలుపులు తెరవగానే ప్రయాణికులందరూ ఎక్కుతారు. మెట్రోలో రద్దీ కారణంగా కొందరు ప్రయాణికులు డోర్ దగ్గరే నిలబడాల్సి వస్తోంది. మెట్రో డోర్‌ దగ్గర నిలబడిన ఓ యువతి తన ఫోన్‌లో ఏదో చూస్తుంది…అంతలోనే బయట ప్లాట్‌ఫామ్‌పై నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఆమెను గమనిస్తున్నాడు.. మెట్రో తలుపు మూసుకునే సమయానికి ఆ వ్యక్తి మెట్రోలో ఉన్న అమ్మాయి చేతిలో ఫోన్‌ లాగేసుకున్నాడు..అంతలోనే మెట్రో తలుపులు మూసుకున్నాయి.. ట్రైన్‌ వెళ్లిపోతుంది.. ఆమె ఎంతగా అరిచినా, గోల చేసినా లాభం లేకపోయింది.. అతడు మాత్రం హాయిగా ఆ అమ్మాయి ఫోన్‌ లాగేసుకుని నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకున్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రయాణాల్లో ఫోన్‌లో మునిగిపోవడం చాలా మందికి అలవాటు. చాలా మంది దొంగలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఫోన్ లేదా మీ విలువైన వస్తువులను కొట్టేసి పారపోతారు. మెట్రో తలుపులు మూసుకుంటున్న తరుణంలో సరైన సమయం చూసి యువతి చేతిలో నుంచి అతడు ఫోన్ లాక్కోవడం చూసి ప్రజలు షాక్‌ అవుతున్నారు. మెట్రోలో జరిగిన ఈ ఘటనలో ఫోన్‌ పోగొట్టుకున్న పరిస్థితిలో యువతి ఏమీ చేయలేకపోతోంది.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @veergurjarpage ద్వారా సోషల్ మీడియాలో వీడియో షేర్‌ చేయబడింది. ఇది ప్రయాణీకులను అప్రమత్తం చేయడానికి, అవగాహన కల్పించడానికి మాత్రమే తయారు చేయబడింది. ఈ వీడియో స్క్రిప్ట్ చేయబడినప్పటికీ, ఇందులో ఒక ముఖ్యమైన సందేశం ఉంది. ఈ వీడియో చూసి జాగ్రత్తగా ప్రయాణం చేయాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. అలాగే, కొంతమంది తమకు జరిగిన కొన్ని దొంగతనాల సంఘటనలను కామెంట్స్‌లో చెప్పడం జరిగింది.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC