Watch Video: ఇదేందయ్యా ఇది.. ! పార్లేజీ బిస్కెట్లతో ఆమ్లెట్.. ఈ కొత్త వంటకం నెటిజన్ల రియాక్షన్ చూడాలి మరీ..
ఈ భయంకరమైన రెసిపీని షేర్ చేసిన తర్వాత, నెటిజన్లు ఈ అసహ్యకరమైన వంటకం తమకు అస్సలు నచ్చలేదంటూ పలు రకాలు స్పందించారు. నేను ఇలాంటివి తినడం కంటే ఆకలితో ఉండటాన్ని ఇష్టపడతాను అని ఒకరు రాశారు. "పార్లేజీ బిస్కెట్లు దుర్వినియోగం చేస్తున్నారంటూ మరొకరు అన్నారు. ఆమ్లెట్ తయారు చేసిన వ్యక్తి తప్పు ఏమీ లేదు. వీడియో తీసిన వ్యక్తి అక్కడికి వెళ్లి పెద్ద తప్పు చేశాడు అంటూ మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.
ఇటీవల కాలంలో జనాలు కొత్త కొత్త రుచులు ఆస్వాదించడానికి మొగ్గు చూపుతున్నారు. వారి అభిరుచులకు తగినట్లే రెస్టారెంట్ చెఫ్‌లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు వెరైటీగా కొత్త వంటకాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఫ్రీగా ఉన్న టైమ్‌లో, లేదంటే యూ ట్యూబ్ ఫేమ్ కోసం చాలా మంది వెరైటీ వంటకాలను ట్రై చేస్తుంటారు. ఎన్నో విచిత్రమైన ఆహార పదార్థాలను కలిపి తయారు చేసిన ఫ్యూజన్ ఫుడ్స్ వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు, ఇటీవల ఓ వ్యక్తి పానీ పూరీలో ఐస్ క్రీమ్ వేసి సప్లై చేశాడు.. అలాగే, కొందరు గులాబ్ జామున్‌తో మరో వెరైటీ ట్రై చేసిన వీడియోలను మనం చూశాం.. ఇదంతా చెప్పడం వెనుక మరోసారి ఓ వింత పదార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు పార్లేజీ బిస్కెట్లతో ఆమ్లెట్ తయారు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఇది ఎలా తయారు చేస్తున్నారో వీడియో ద్వారా చూసి మీ అభిప్రాయం షేర్ చేయండి..వివరాల్లోకి వెళితే..
ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి గుడ్లు, పార్లేజీ బిస్కెట్లు ఉపయోగించి ఆమ్లెట్ తయారు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ ఫుడ్ అమ్ముతున్న వీడియోను Instagram ద్వారా @foodb_unk అనే ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో మొదటగా, ఆమ్లెట్ అమ్మే వ్యక్తి రెండు గుడ్లను ఒక గిన్నెలో పగలగొట్టాడు. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిరపకాయలు మరియు మసాలా దినుసులు వేసి గుడ్డును బాగా కొట్టాడు. బాణలిలో వెన్న వేడి చేసి, దానికి బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని వేశాడు. అప్పుడు అతను పార్లేజీ బిస్కట్ కేస్ తెరిచి దాదాపు అన్ని బిస్కెట్లను గుడ్డు మిశ్రమం పైన ఉంచాడు. చివరగా, పైన తురిమిన చీజ్ వేసి, ఆమ్లెట్‌ను తిప్పాడు. సాస్ ఉన్న ప్లేట్‌లో సర్వ్ చేశాడు..ఇదంతా వీడియోలో మనం చూడవచ్చు.
View this post on Instagram
ఈ భయంకరమైన రెసిపీని పంచుకున్న తర్వాత, నెటిజన్లు ఈ అసహ్యకరమైన వంటకం తమకు అస్సలు నచ్చలేదని పలు వ్యాఖ్యలు రాశారు. నేను ఇలాంటివి తినడం కంటే ఆకలితో ఉండటాన్ని ఇష్టపడతాను అని ఒకరు రాశారు. “పార్లేజీ బిస్కెట్లు దుర్వినియోగం చేస్తున్నారంటూ మరొకరు అన్నారు. ఆమ్లెట్ తయారు చేసిన వ్యక్తి తప్పు ఏమీ లేదు. వీడియో తీసిన వ్యక్తి అక్కడికి వెళ్లి పెద్ద తప్పు చేశాడు అంటూ మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. అలాంటి మురికి వంటలు చేయడానికి ఎవరైనా డబ్బు ఇస్తారా? అని మరో వ్యక్తి అడిగారు. పార్లేజీ బిస్కెట్లు.., మేము మిమ్మల్ని రక్షించలేకపోయాము.. మమ్మల్ని క్షమించండి అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..