Viral Video: యమ జాతకుడు..! రెండుసార్లు పిడుగుపడ్డా బతికిపోయాడు… వీడియో వైరల్..
ఈ వీడియో చూసిన జనాలు ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు పిడుగుపాటుకు గురైనా ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడంటే ఎవరూ నమ్మలేరు. కానీ, ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేస్తూ..ఆ వ్యక్తి రెండు సార్లు పిడుగు పాటుకు గురైన మరణం నుండి బయటపడి సురక్షితంగా ఇంటికి వెళ్లాడు.. కొంతమంది ఈ వీడియోను ఎడిట్ చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. అయితే,
ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమనైన కుట్టదని అంటారు..ఈ మాట అందరికీ తెలిసిందే.. అయితే ఈ మాట ఒక వ్యక్తి జీవితంలో నిజమైంది. ఎందుకంటే.. కొన్ని సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పిడుగుపాటుకు గురయ్యాడు, కానీ ఇప్పటికీ అతనికి ఒక వెంట్రుక కూడా దెబ్బతినలేదు. మొత్తం సార్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృత్యువును ధిక్కరించి మళ్లీ వచ్చారని నెటిజన్లు రాసుకుంటున్నారు.
పిడుగుపాటు వల్ల ఎంతటి విధ్వంసం కలుగుతుందో మనందరం చూశాం. అయితే వైరల్‌గా మారుతున్న వీడియో మాత్రం మిమ్మల్నీ షాక్‌కు గురిచేస్తుంది. ఈ వీడియో @thefige_ అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 80 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది కామెంట్లు చేస్తూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో మొత్తం ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ. వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై ఎక్కడికో వెళ్తున్న సమయంలో ఆకాశం నుంచి మెరుపు అతనిపై పడుతుండడం వీడియోలో కనిపిస్తోంది. వీడియోని బట్టి అది పిడుగు అని తెలుస్తోంది.. అయితే, పిడుగు పడగానే అతడు వెంటనే నేలమీద పడిపోతాడు. అందరూ అతడు చనిపోయాడని అనున్నప్పటికీ అతడు కొంతసేపటికి లేచి నిలబడ్డాడు. ఆ తరువాత అతడు..మళ్లీ కొంత దూరం నడిచిన వెంటనే.. ఆపై మరోసారి అతనిపై పిడుగు పడింది..ఈసారి కూడా అతడు అడ్డం పడ్డాడు. అతను మళ్లీ నేలపై వాలిపోయాడు.. అతను పడిపోవడం చూస్తే, ఈసారి అతను ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయినట్లు అనిపిస్తుంది. కానీ ఈసారి కూడా అతడు మృత్యువును తప్పించుకుని లేచాడు.
Lightning does not strike the same place twice, but it does strike the same person. pic.twitter.com/2NfOWSF7fg
— Figen (@TheFigen_) December 14, 2023
ఈ వీడియో చూసిన జనాలు ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు పిడుగుపాటుకు గురైనా ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడంటే ఎవరూ నమ్మలేరు. కానీ, ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేస్తూ..ఆ వ్యక్తి రెండు సార్లు పిడుగు పాటుకు గురైన మరణం నుండి బయటపడి సురక్షితంగా ఇంటికి వెళ్లాడు.. కొంతమంది ఈ వీడియోను ఎడిట్ చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. అయితే, వీడియోపై అనేక ప్రశ్నలను లేవనెత్తిన వారికి కూడా అది ఎడిట్ చేయబడిందని నిర్దిష్ట ఆధారాలు లేవు. కాగా, ఈ వీడియో 2011 సంవత్సరానికి చెందినదిగా చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..