AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ex MP Sircilla Rajaiah: సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట.. కోడలు, మనవళ్ల ఆత్మహత్య కేసులో నిర్దోషులుగా కోర్టు తీర్పు..

Ex-Congress MP Sircilla Rajaiah: కోడలు ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు(MP Sircilla Rajaiah) భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యలపైనా నమోదైన కేసును వరంగల్ జిల్లా కోర్టు(Warangal Dist Court) మంగళవారం కొట్టివేసింది.

Ex MP Sircilla Rajaiah: సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట.. కోడలు, మనవళ్ల ఆత్మహత్య కేసులో నిర్దోషులుగా కోర్టు తీర్పు..
Ex Congress Mp Sircilla Raj
Sanjay Kasula
|

Updated on: Mar 22, 2022 | 6:02 PM

Share

కోడలు ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు(MP Sircilla Rajaiah) భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యలపైనా నమోదైన కేసును వరంగల్ జిల్లా కోర్టు(Warangal Dist Court) మంగళవారం కొట్టివేసింది. 2015, నవంబర్ 4న సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, మనవళ్లు అభినవ్‌, ఆయాన్, శ్రీయాన్ అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిరిసిల్ల రాజయ్య దంపతులతో పాటు సారిక భర్త, ఇతర కుటుంబసభ్యులను అరెస్ట్ వరంగల్ జైలుకు తరలించారు.

అయితే వారిది హత్య కాదని.. గ్యాస్ లీక్ అవడం వల్లే ప్రమాదం జరిగిందని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ  నిపుణులు అప్పట్లోనే నివేదిక సమర్పించారు. అయితే.. ఘటనా స్థలం నుంచి వస్తువులను సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఎంజీఎంలో పోస్టుమార్టం సమయంలో కూడా విస్రా టెస్టు కోసం శరీర భాగాల నుంచి నమూనాలను సేకరించారు నిపుణులు. వారు పంపిన శాంపిల్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 20 రోజుల పాటు పరీక్షలు జరిపిన నిపుణులు చివరకు వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవి పై గతంలో కేసు నమోదైంది. అయితే..ఈ కేసులో మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య.. కుటుంబమే అసలు దోషులని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం వరంగల్ జిల్లా కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చి తీర్పును ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కు భారీ ఊరట లభించింది. అయితే దీనికి సంబంధించి సరైన ఆధారాలు పోలీసులు సమర్పించకపోవడంతో వరంగల్ జిల్లా న్యాయస్థానం రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం కేసు కొట్టేసింది.

ఇవి కూడా చదవండి: బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..

Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..