Preethi Case: మెడికో ప్రీతి డెత్‌పై వీడని మిస్టరీ.. కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన పోలీసులు..
Preethi Murder Case: మెడికో ప్రీతి డెత్‌పై డౌట్స్ కంటిన్యూ అవుతున్నాయ్. తల్లిదండ్రులేమో హత్యా అంటున్నారు. పోలీసులేమో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇంతకీ, పోలీసులు చెబుతోన్న వెర్షన్ ఏంటి?

మెడికో ప్రీతి డెత్‌పై డౌట్స్ కంటిన్యూ అవుతున్నాయ్. అసలెలా చనిపోయిందనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేకపోతున్నారు పోలీసులు. సూసైడ్ చేసుకుందనేది ప్రాథమిక అంచనా అయినా, అందుకు అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు. టాక్సికాలజీ రిపోర్ట్‌లో పాయిజన్ ఆధారాలు దొరక్కపోవడంతో ప్రీతి డెత్‌పై మిస్టరీ కొనసాగుతోంది. అయితే, ప్రీతి డెత్‌పై మరోసారి కీలక కామెంట్స్ చేశారు వరంగల్ సీపీ రంగనాథ్. ప్రీతి మృతికి సూసైడ్ లేదా కార్డియాక్ అరెస్ట్ కారణం కావొచ్చన్నారు.
ప్రీతి అసలెలా చనిపోయిందో తేలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు వరంగల్ సీపీ రంగనాథ్. హత్య కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే, హత్య కోణంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని వరంగల్ సీపీ చెప్పారు.
కానీ, సూసైడ్ చేసుకుని ఉండొచ్చనడానికి కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ కోసం ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు ఎవిడెన్స్ ఉందన్నారు. ప్రీతి ఎలా చనిపోయినా.. దానికి కారణం మాత్రం ర్యాగింగ్, వేధింపులే అని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ఇది తమ దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందన్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
