వరంగల్‌లో గ్రూప్-2 అధికారి మిస్సింగ్ కలకలం..
వరంగల్ జిల్లాలో గ్రూప్-2 అధికారి మిస్సింగ్ కలకలం రేగింది. గ్రూప్-2 అధికారి, ప్రస్తుతం ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మోపు ఆనంద్ రెడ్డి
వరంగల్ జిల్లాలో గ్రూప్-2 అధికారి మిస్సింగ్ కలకలం రేగింది. గ్రూప్-2 అధికారి, ప్రస్తుతం ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మోపు ఆనంద్ రెడ్డి గత నాలుగు రోజులుగా కనిపించకుండాపోయారు. ఈనెల ఏడోతేదీన ఆనంద్ రెడ్డి అతని స్నేహితుడు ప్రదీప్‌రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు..ఆ రోజు నుంచి నాలుగు రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆనంద్ రెడ్డి అదృశ్యంపై కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మరోవైపు మోపు ఆనంద్ రెడ్డి స్నేహితుడు.. ప్రదీప్ రెడ్డి కూడా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ స్నేహితుడు ప్రదీప్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.