Warangal East Election Result 2023: వరంగల్ తూర్పులో కొండా సురేఖ ఘన విజయం.. రెండో స్థానంలో ఎవరున్నారంటే..?
Warangal East Assembly Election Result 2023 Live Counting Updates: వరంగల్ తూర్పు నియోజకవర్గం.. ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లా.. ఉమ్మడి రాష్ట్రం సహా.. తెలంగాణ రాజకీయల్లో వరంగల్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో.. వాణిజ్యం పరంగా వరంగల్ కేంద్ర బిందువుగా ఉందని పేర్కొనవచ్చు.. అయితే, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో మళ్లీ హేమాహేమీల మధ్య పోరు నెలకొననుంది.

Warangal East Assembly Election Result 2023 Live Counting Updates: వరంగల్ తూర్పు నియోజకవర్గం.. ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లా.. ఉమ్మడి రాష్ట్రం సహా.. తెలంగాణ రాజకీయల్లో వరంగల్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో.. వాణిజ్యం పరంగా వరంగల్ కేంద్ర బిందువుగా ఉందని పేర్కొనవచ్చు.. అయితే, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో మళ్లీ హేమాహేమీల మధ్య పోరు నెలకొననుంది. దీంతో 2023లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,54,641 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 30న 66.74 శాతం ఓటింగ్ నమోదయ్యింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన హోరాహోరి పోరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొండా సురేఖ విజయం ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావుపై 15 వేల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ మూడో స్థానంలో నిలిచారు.
ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా వరంగల్ తూర్పులో త్రిముఖపోటీ నెలకొంది. ఈసారి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తలపడ్డాయి. వరంగల్ తూర్పులో మొదటినుంచి కాంగ్రెస్ కు పట్టుఉండగా.. 2014 నుంచి బీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ మళ్లీ సిట్టింగ్ అభ్యర్థికే టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు బరిలో నిలవగా.. చిరవకు కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి ఘన విజయం సాధించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
గత ఎన్నికలను పరిశీలిస్తే..
- 2009లో కాంగ్రెస్ నేత బస్వరాజు సారయ్య.. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై గెలిచారు. సారయ్యకు 41,952 ఓట్లు రాగా.. ప్రదీప్ రావుకు 34,697 ఓట్లు వచ్చాయి.
- 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా సురేఖ.. కాంగ్రెస్ నేత బస్వరాజు సారయ్యపై గెలిచారు. సురేఖకు 88641 ఓట్లు రాగా.. సారయ్యకు 33556 ఓట్లు పోలయ్యాయి.
- 2018 లో టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్.. కాంగ్రెస్ నేత వద్దిరాజు రవిచంద్రపై గెలిచారు. నరేందర్ కు 83922 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు 55140 ఓట్లు వచ్చాయి.
తూర్పు స్థానం కోసం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి లాంటి వారు ప్రయత్నించగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ దక్కింది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పద్మశాలి, మైనారిటీ, దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాలు ఎవరికి మద్దతునిస్తాయో.. వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్




