AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మొదలైన వాటర్ వార్..

ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు కృష్ణా జలాలపై గతంలో జరిగిన ఒప్పందంలో సంతకం పెట్టింది మీరే కదా అని గులాబీ పార్టీకి కౌంటర్ ఇచ్చింది బీజేపీ. దీంతో తెలంగాణలో మళ్లీ నీళ్లపై రాజకీయం రాజుకుంది.

Telangana: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మొదలైన వాటర్ వార్..
Brs Bjp Congress
Shaik Madar Saheb
|

Updated on: Jan 20, 2024 | 6:04 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ మొదలైంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందన్న హరీష్ రావు వ్యాఖ్యలు పొలిటికల్‌ హీట్ పెంచాయి. కేంద్రం నుంచి అలాంటి ప్రతిపాదన వచ్చిందని.. కానీ తాము అందుకు ఒప్పుకోలేదని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

ప్రభుత్వం వివరణ ఇచ్చినా.. ఈ అంశంపై బీఆర్ఎస్‌ మాత్రం తన వాదన వినిపిస్తూనే ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులను KRMB నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి. కేంద్రం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కృష్ణా నదీ జలాలకు సంబంధించి జరిగిన ఒప్పందంపై కేసీఆర్‌ సంతకం చేశారని.. అప్పుడు హరీశ్‌రావు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

తీవ్ర అన్యాయం..

ఉమ్మడి ప్రాజెక్టులను KRMB నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. కేఆర్‌ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను తీసుకెళ్లడం సరికాదని సూచించారు. కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం ఆంధ్ర ప్రయోజనాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిరంజన్‌రెడ్డి.

ఉమ్మడి ప్రాజెక్టులు నిజంగానే KRMB పరిధిలోకి వెళతాయా లేదా అన్న విషయంలో క్లారిటీ రాకపోయినా.. రాజకీయ పార్టీలు మాత్రం తప్పు మీదంటే మీదే అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!