Telangana: లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..

|

Apr 26, 2024 | 9:23 PM

గన్‌పార్క్‌ రాజకీయం మళ్లీ మొదలైంది. తెలంగాణలో సవాళ్ల పర్వం.. రాజీనామాల వరకు దారితీస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న అప్పర్‌ హ్యాండ్‌ పాలిటిక్స్‌ రోజు రోజుకు పీక్స్‌కు చేరుతున్నాయి. హరీష్‌రావు, రేవంత్‌ మధ్య మాటల యుద్ధం చేతలకు దారితీస్తుండడంతో.. ఈ హైడ్రామా ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గన్‌ పార్కు మరోసారి రాజకీయ వేదికగా మారింది.

Telangana: లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
Cm Revanth Vs Harish Rao
Follow us on

గన్‌పార్క్‌ రాజకీయం మళ్లీ మొదలైంది. తెలంగాణలో సవాళ్ల పర్వం.. రాజీనామాల వరకు దారితీస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న అప్పర్‌ హ్యాండ్‌ పాలిటిక్స్‌ రోజు రోజుకు పీక్స్‌కు చేరుతున్నాయి. హరీష్‌రావు, రేవంత్‌ మధ్య మాటల యుద్ధం చేతలకు దారితీస్తుండడంతో.. ఈ హైడ్రామా ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గన్‌ పార్కు మరోసారి రాజకీయ వేదికగా మారింది. అమరవీరుల స్థూపం సాక్షిగా సవాళ్ల పర్వం మళ్లీ సాగింది. అట్లుంటది తెలంగాణ పొలిటికల్‌ లీడర్స్‌‎తోని. అధికారంలోకి రాగానే అదంటివి.. ఇదంటివి.. రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటివి ఏది సీఎం సారూ.. అని బీఆర్‌ఎస్‌ మళ్లీ మొదలుపెట్టింది. అసలు రేవంత్‌కు ఆ ఉద్దేశమే లేదని వాదిస్తోంది. నిజంగా రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. పంద్రాగస్ట్‌లోపు రుణమాఫీ చేస్తే గనుక.. ఇదిగో నా రాజీనామా చేసేసి ఇంటికెళ్లిపోతా అంటున్నారు మాజీ ఆర్థిక మంత్రి.. ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు. అనుభవంతో చెబుతున్నా.. రేవంత్‌ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేరు అన్నది హరీష్‌ రావు వాదన. అందుకే ఆయన అంత బలంగా రాజీనామా చేస్తానంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.

అటు రేవంత్‌ కూడా ఘాటుగానే రియాక్ట్‌ అవుతున్నారు. గెట్‌ రెడీ ఫర్‌ రిజైన్‌ అంటున్నారు. అంతేకాదు.. ఎంపీ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడికెళ్లినా.. దేవుళ్లపై ఒట్టుపెడుతూ పంద్రాగస్ట్‌లోపు రుణమాఫీ చేసి తీరతా అంటూ ప్రమాణం చేస్తున్నారు రేవంత్‌ రెడ్డి. ఈ నేపథ్యంలో హరీష్‌రావు నిజంగానే తన మాటకు కార్యరూపం ఇచ్చారు. ఓ రాజీనామా పత్రాన్ని రాసుకుని.. సంతకం కూడా పెట్టేశారు. అంతేకాదు.. ఆ పత్రాన్ని జేబులో పెట్టుకుని గన్‌పార్కుకు వెళ్లారు. అమరవీరుల స్థూపం సాక్షిగా ఇద్దరం రాజీనామాలు చేసి.. మేధావుల చేతిలో పెడదామన్నారు హరీష్‌. రుణమాఫీ చేస్తే తనది, లేకుంటే రేవంత్‌ రాజీనామా ఆమోదించేలా బాండుపేపర్‌పై సంతకం పెడదామని ఛాలెంజ్‌ విసిరారు. హరీష్‌ రావు సవాల్‌పై సీఎం రేవంత్‌ ఇప్పటికే చాలాసార్లు స్పందించారు. ప్రచార సభలు దద్దరిల్లేలా ప్రమాణాలు చేస్తూ సవాల్‌ని స్వీకరిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు గన్‌పార్కు ఎపిసోడ్‌ తర్వాత మళ్లీ స్పందించారు సీఎం రేవంత్‌. ఆయన రాజీనామా లేఖపై ఘాటు కామెంట్స్‌ చేశారు. ఇక హరీష్‌రావు వచ్చి వెళ్లిన తర్వాత గన్‌పార్కును శుభ్రం చేశారు కాంగ్రెస్‌ నేతలు. ఆయనకు అమరవీరులు ఇప్పుడు గుర్తొచ్చారా అంటు మండిపడ్డారు.