తెలుగు రాష్ట్రాల్లో దొంగ ఫంక్షన్లు.. ఇన్విటేషన్ అవసరం లేదు.. అందరికీ ఫ్రీ..

అదేంటి పెరిగిన ఖర్చులతో ఎవరైనా శుభకార్యాలు చేయాలంటే భయపడుతున్న ఈ రోజుల్లో ఫ్రీ ఫంక్షన్ ఏంటి అనుకుంటున్నారా.. అవును నిజమే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఫ్రీ ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇదంతా పార్లమెంటు ఎన్నికల మాయాజాలం. ఎలక్షన్ కోడ్‎ను తప్పించుకోవడానికి కార్యకర్తలతో సమావేశాలు, పార్టీ మీటింగులు, కుల సంఘాలతో సభలు, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఆమ్యామ్యాలు. అంతా ఈ ఫంక్షన్ల ద్వారానే జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో దొంగ ఫంక్షన్లు.. ఇన్విటేషన్ అవసరం లేదు.. అందరికీ ఫ్రీ..
Election Code
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 14, 2024 | 9:31 AM

అదేంటి పెరిగిన ఖర్చులతో ఎవరైనా శుభకార్యాలు చేయాలంటే భయపడుతున్న ఈ రోజుల్లో ఫ్రీ ఫంక్షన్ ఏంటి అనుకుంటున్నారా.. అవును నిజమే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఫ్రీ ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇదంతా పార్లమెంటు ఎన్నికల మాయాజాలం. ఎలక్షన్ కోడ్‎ను తప్పించుకోవడానికి కార్యకర్తలతో సమావేశాలు, పార్టీ మీటింగులు, కుల సంఘాలతో సభలు, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఆమ్యామ్యాలు. అంతా ఈ ఫంక్షన్ల ద్వారానే జరుగుతుంది. ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి పార్టీ పేరుతో పెట్టె ప్రతి రూపాయి ఎన్నికల కమిషన్ లెక్క కడుతుంది. నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థి లెక్కల్లో అసలు లెక్క బయటకు వస్తుంది. ఇప్పుడు పెట్టే ఖర్చు మాత్రం పార్టీ లెక్కలు చూస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ షెడ్యూల్‎కు.. పోలింగ్‎కు మధ్య చాలా గ్యాప్ ఉండడంతో ముందుగానే అన్ని పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం మొదలుపెట్టాయి. ఎలక్షన్ కమిషన్ అన్ని కార్యక్రమాలపై నిఘా పెట్టడంతో ఇలా దొంగ ఫంక్షన్లు చేస్తున్నారు నేతలు.

కార్యకర్తల్లో ఎవరిదో ఒకరిది పుట్టినరోజు అని చెప్పి ధూంధాం దావత్ అరేంజ్ చేస్తున్నారు. వీటితోపాటు పెద్దమ్మ తల్లి దావతు, ఊర్లల్లో ఉండే అమ్మవార్ల పేరుతో భోజనాలు, గుడుల వద్ద అన్నదానాలు. ఇవన్నీ ఎలక్షన్ కోడ్ నుంచి తప్పించుకోవడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న జిమ్మిక్కులు. అక్కడ ఫంక్షన్ పేరు ఏదో ఉంటుంది కానీ లోపల జరిగేది మాత్రం ఆ పార్టీ కార్యకర్తల సమావేశం. పెద్దమ్మ తల్లి పేరుతో చేసే భోజనాలన్నీ ఆ కుల సంఘాల మీటింగ్ లే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఏదో పేరుతో ఫంక్షన్‎లు జరుగుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణలో అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిజంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్న ఫంక్షన్ హాల్ దొరకని పరిస్థితి. కొంతమంది అభ్యర్థులు నెలల తరబడి ఫంక్షన్ హాల్స్‎ని బుక్ చేసుకున్నారు. పోలీస్ రికార్డుల్లో, ఫంక్షన్ హాల్ లాగ్ షీట్‎లో రోజు ఎవరిదో ఒక బర్త్డే పేరుతో బుక్ అయి ఉంటుంది. కానీ అక్కడ బర్త్డే లేవీ జరగవు. అన్ని పొలిటికల్ దావతులే. గతంలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ దొంగ ఫంక్షన్లు జరుగుతున్నాయి. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా వీటిపై దృష్టి పెట్టింది. ఇకపై ఫంక్షన్ల దగ్గర ఫ్లైయింగ్ స్క్వాడ్ వెళ్లి డీటెయిల్స్ సేకరించాలని భావిస్తుంది. అసలు ఆ శుభకార్యం ఎవరి పేరుతో జరుగుతుంది ఎందుకు జరుగుతుంది.. అక్కడ ఆ సంబంధిత వ్యక్తులు ఉన్నారా. ఇలాంటి వివరాలతో కొంత ఈ దొంగ ఫంక్షన్లకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..