AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ వైన్ షాప్ వద్దంటూ కాలనీవాసుల పోరాటం.. పనులు మానేసి మరీ నిరసనలు..

హైదరాబాదులో ఏ గల్లీలో చూసిన వైన్ షాప్ కనిపిస్తుంది. అడ్డగోలుగా ఇచ్చిన పర్మిషన్లతో.. కిరాణా షాపులతో పోటీపడి వైన్ షాపులు కనిపిస్తాయి. మొన్న తాజాగా జనవరిలో వచ్చిన టెండర్లతో బోడుప్పల్లో సింధూర లిక్కర్స్ పేరుతో వైన్ షాప్ దక్కించుకున్నారు. అయితే అప్పటినుంచి ఆ లిక్కర్ షాప్ పెట్టుకోవడానికి ఎక్కడ వాళ్లకి స్థలం దొరకలేదు. బోడుప్పల్లో వివిధ ప్రాంతాల్లో ఆ వైన్ షాప్‎ను ప్రారంభించడానికి ప్రయత్నించినా అక్కడి స్థానికులు అడ్డుకోవడంతో నెల రోజుల పాటు ప్రారంభించకుండానే ఉండిపోయారు.

ఇక్కడ వైన్ షాప్ వద్దంటూ కాలనీవాసుల పోరాటం.. పనులు మానేసి మరీ నిరసనలు..
Liquor Shop
Rakesh Reddy Ch
| Edited By: Srikar T|

Updated on: Apr 14, 2024 | 2:00 PM

Share

హైదరాబాదులో ఏ గల్లీలో చూసిన వైన్ షాప్ కనిపిస్తుంది. అడ్డగోలుగా ఇచ్చిన పర్మిషన్లతో.. కిరాణా షాపులతో పోటీపడి వైన్ షాపులు కనిపిస్తాయి. మొన్న తాజాగా జనవరిలో వచ్చిన టెండర్లతో బోడుప్పల్లో సింధూర లిక్కర్స్ పేరుతో వైన్ షాప్ దక్కించుకున్నారు. అయితే అప్పటినుంచి ఆ లిక్కర్ షాప్ పెట్టుకోవడానికి ఎక్కడ వాళ్లకి స్థలం దొరకలేదు. బోడుప్పల్లో వివిధ ప్రాంతాల్లో ఆ వైన్ షాప్‎ను ప్రారంభించడానికి ప్రయత్నించినా అక్కడి స్థానికులు అడ్డుకోవడంతో నెల రోజుల పాటు ప్రారంభించకుండానే ఉండిపోయారు. నెల రోజుల క్రితం బోడుప్పల్‎లోని సిద్ధార్థ స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం యజమాని వారికి లీసు ఇవ్వడంతో అక్కడ రేకుల షెడ్డు వేసి వైన్స్ ఓపెన్ చేశారు.

ఒకవైపు ఎదురుగా స్కూల్ ఉండడం.. పక్కనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉండడం.. వెనకాల కాలనీ ఉండడంతో అంతా వైన్ షాప్‎ను అక్కడ నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కానీ అన్ని అనుమతులు ఉన్నాయని మేమేం చేయలేం అంటూ పోలీసులు చేతులెత్తేయడంతో నెల రోజులుగా ప్రతిరోజు ధర్నా నిర్వహిస్తున్నారు స్థానికులు. కాలనీలో పనిచేసే మహిళలు సాయంత్రం సమయంలో వైన్ షాప్‎కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ వైన్ షాప్ పక్కనే టెంట్ వేసుకొని కూర్చుంటున్నారు. ఇక ఉద్యోగాలు చేసుకునే ఆ కాలనీవాసులు కొంతమంది లీవ్ పెట్టుకొని మరి ఉదయం పూట వైన్ షాప్‎కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. నిజానికి వైన్ షాప్ నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్న స్కూల్ దగ్గరలో ఉండొద్దని నిబంధనను ఉల్లంఘించారనేది స్థానికులు ఆరోపణ. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన దూరంలోనే వైన్ షాప్ పెట్టాలని షాపు యజమాని వివరణ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..