Smart Cities: ప్రపంచంలో స్మార్ట్ సిటీలు ఇవే.. మన హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే!

ప్రపంచంలోని ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయి. జనాలను నిత్యం ఆకట్టుకుంటూ మెరుగైన జీవన సదుపాయాలను అందిస్తున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటుతూ స్మార్ట్ సిటీలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. అయితే ప్రపంచంలో మొత్తం ఎన్ని స్మార్ట్ సిటీలున్నాయి? మన హైదరాబాద్ స్థానం ఎంతంటే ఈ కింది విషయాలు తెలుసుకోవాలి.

Smart Cities: ప్రపంచంలో స్మార్ట్ సిటీలు ఇవే.. మన హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే!
Hyderabad
Follow us

|

Updated on: Apr 14, 2024 | 7:16 AM

ప్రపంచంలోని ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయి. జనాలను నిత్యం ఆకట్టుకుంటూ మెరుగైన జీవన సదుపాయాలను అందిస్తున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటుతూ స్మార్ట్ సిటీలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. అయితే ప్రపంచంలో మొత్తం ఎన్ని స్మార్ట్ సిటీలున్నాయి? మన హైదరాబాద్ స్థానం ఎంతంటే ఈ కింది విషయాలు తెలుసుకోవాలి. సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్ యూటీడీ) సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ (ఐఎండీ) ప్రపంచంలోని స్మార్ట్ సిటీల జాబితాను ఐఎండీ స్మార్ట్ సిటీ ఇండెక్స్ ను విడుదల చేసింది. ప్రపంచంలోని స్మార్ట్ సిటీలను నిర్ణయించడానికి అధ్యయనం ఐదు ప్రధాన అంశాలను తీసుకొని ప్రకటించింది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవలు లాంటివాటిని పరిగణనలోకి తీసుకుంది. ఆరోగ్యం, భద్రత, కార్యకలాపాలు, విద్యా వ్యవస్థ, వైద్యం, ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందంటూ బేరీజు వేస్తూ స్మార్ట్ సిటీలను ప్రకటించింది.

ఈ ఏడాది కూడా స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ అగ్రస్థానంలో నిలిచింది. 2019 నుంచి ఈ నగరం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా, సింగపూర్ మినహా ప్రపంచంలోని టాప్ టెన్ స్మార్ట్ సిటీలన్నీ యూరప్ లోనే ఉన్నాయి.

ప్రపంచంలోని టాప్ 10 స్మార్ట్ సిటీల జాబితా

స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్.. నార్వేకు చెందిన ఓస్లో.. ఆస్ట్రేలియాకు చెందిన కాన్ బెర్రా.. స్విట్జర్లాండ్ లోని జెనీవా.. డెన్మార్క్ లోని కోపెన్ హాగన్.. స్విట్జర్లాండ్ కు చెందిన లాసానే.. యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ ఫిన్లాండ్కు చెందిన హెల్సింకి.. యూఏఈలోని అబుదాబి..

స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాద్ కు స్థానం

అయితే ప్రపంచంలోని భారతీయ స్మార్ట్ సిటీల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారి 106వ స్థానంలో నిలిచింది. రెండో టాప్ ఇండియన్ స్మార్ట్ సిటీ ముంబై. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచ జాబితాలో 107వ స్థానంలో నిలిచింది. భారత్ లో స్మార్ట్ సిటీల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ గత ఏడాదితో పోలిస్తే 5 స్థానాలు ఎగబాకి ప్రపంచవ్యాప్తంగా 111వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 142 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

భారతదేశంలో స్మార్ట్ నగరాల జాబితా

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్