అటు గోదావరి.. ఇటు ప్రణాహిత.. త్రివేణి సంగమం వద్ద విచిత్ర వర్ణం.. పులకించిపోయిన భక్తులు
కాలేశ్వరం పుష్కర ఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద వర్ణాలు స్థానికులు షాక్ అవుతున్నారు. ఎగువ నుండి వచ్చే గోదావరి - ప్రాణహిత కలయిక వద్ద గోదావరి రెండు రంగులలో ప్రవహించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విచిత్ర సన్నివేశాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించి మురిసి పోయారు.
కాలేశ్వరం పుష్కర ఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద వర్ణాలు స్థానికులు షాక్ అవుతున్నారు. ఎగువ నుండి వచ్చే గోదావరి – ప్రాణహిత కలయిక వద్ద గోదావరి రెండు రంగులలో ప్రవహించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విచిత్ర సన్నివేశాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించి మురిసి పోయారు.
గోదావరి, ప్రాణహిత రెండు నదులు మహారాష్ట్రలోనే ఆవిర్భవిస్తాయి. దిగువన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కాలేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత అంతర్వాహిని కలయికనే త్రివేణి సంగమంగా పిలుస్తారు. కాళేశ్వరం సమీపంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద నీలి రంగులో.. ప్రాణహిత వరద ఎరుపు రంగులో ప్రవహించడం.. ఆ రెండు కలయిక చోట రెండు వర్ణాలలో గోదావరి దిగువకు ప్రవహించడం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.
గోదావరిలో పుణ్య స్థానంలో ఆచరించడం కోసం వచ్చిన భక్తులు ఆ మార్గంలో వెళ్లే స్థానికులు ఈ విచిత్ర వరద ప్రవాహాన్ని సెల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..