Kishan Reddy: మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

|

Sep 07, 2024 | 7:43 PM

మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షపార్టీలు అధికారంలో ఉన్న చోట అత్యాచార ఘటనలను సొంత ప్రయోజనాల కోసం నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు.

Kishan Reddy: మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..
Rahul Gandhi - Kishan Reddy
Follow us on

మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షపార్టీలు అధికారంలో ఉన్న చోట అత్యాచార ఘటనలను సొంత ప్రయోజనాల కోసం నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఈ మేరకు శనివారం కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఓ ఆదివాసీ మహిళపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని.. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ కలిసి ఆ కేసును నీరుగార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాయంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.. ఎందుకంటే నేరస్థుడు మైనారిటీ వర్గానికి చెందినవాడని.. కాంగ్రెస్ పార్టీ మహిళల భద్రత, వారి శ్రేయస్సు కంటే ఎక్కువగా రాజకీయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందంటూ పేర్కొన్నారు. బిజెపి అధికారంలో రాష్ట్రంలో అత్యాచార ఘటన జరిగిందన్న విషయం తెలిసి.. రాహుల్ గాంధీకి అకస్మాత్తుగా జ్ఞానోదయం అయి.. వెంటనే దానిపై స్పందించారన్నారు. అయితే.. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం.. వేగంగా స్పందించి.. శిక్షవేసేందుకు చురుగ్గా దర్యాప్తు చేస్తుందని, దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించలేదంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో డాక్టర్‌పై అత్యాచారం జరిగిన తర్వాత లేదా పైన పేర్కొన్న జైనూర్ విషయంలో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, వారి మిత్రపక్షాల ప్రవర్తనతో దీన్ని కూడా పోల్చాలంటూ కిషన్ రెడ్డి వివరించారు.

తెలంగాణలో గత 3 నెలల్లో మహిళలపై అనేక అత్యాచారాలు, హింసలు, అఘాయిత్యాలు జరిగాయంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పలు సంఘటనలను ప్రస్తావించారు.

13-జూన్-24: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.

22-జూన్-24: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక గిరిజన మహిళను వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఆమెను కాల్చి, కొట్టి, ఆమె కళ్లకు, ప్రైవేట్ భాగాలకు కారం పొడి చల్లారు.

21-జూలై-24: నాగర్‌కర్నూల్ జిల్లా హాజీపూర్‌లో ఇద్దరు మహిళా కూలీలపై షాపు యజమానులు కారులో లైంగిక దాడికి పాల్పడ్డారు.

24-జూలై-24: మలక్‌పేట అంధుల పాఠశాలలో 8 ఏళ్ల దృష్టిలోపం ఉన్న బాలికపై దాడి జరిగింది.

30-జూలై-24: నిర్మల్‌కు చెందిన 26 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగింది.

30-జూలై-24: వనస్థలిపురంలో 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

4-ఆగస్టు-24: దొంగతనం ఆరోపణతో దళిత మహిళ సునీతను షాద్‌నగర్ పోలీసులు దారుణంగా హింసించారు.

22-ఆగస్టు-24: నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ మద్దతుదారులు దాడి చేశారు.. అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలపై హింసను ఉపయోగించకూడదని బిజెపి ఈ సంఘటనలను నిలకడగా, సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో దూకుడు పనిచేయదన్న విషయం రాహుల్ గాంధీ గ్రహించాలన్నారు. భారతదేశానికి ఇప్పుడున్నంత బాధ్యతారహితమైన ప్రతిపక్ష నాయకుడు ఎన్నడూ లేరంటూ  కిషన్ రెడ్డి.. రాహుల్ పై మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..