AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి!

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర చికిత్స కోసం రోగులతో హైదరాబాద్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

ఘోర రోడ్డు ప్రమాదం.. రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి!
Road Accident
Balaraju Goud
|

Updated on: Oct 23, 2026 | 8:06 AM

Share

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర చికిత్స కోసం రోగులతో హైదరాబాద్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ వై జంక్షన్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం జరి గ్రామానికి చెందిన రోగులతో అంబులెన్స్ హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో కడ్తాల్ వై జంక్షన్ వద్ద అంబులెన్స్‌ను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్న దర్యాప్తు చేపట్టారు. రోగులను అత్యవసర చికిత్స కోసం తీసుకెళ్తున్న అంబులెన్సే ప్రమాదానికి గురికావడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us