Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Telugu: నెం.1గా జెండా ఎగరవేసిన టీవీ9.. తెలుగు మీడియా చరిత్రలో ఆల్‌టైమ్‌ హై రేటింగ్స్‌

తెలుగు నాట పుట్టి దేశంలో నెంబర్ 1 న్యూస్ నెట్ వర్క్‌గా ఎదిగిన టీవీ9 తెలుగులో మళ్ళీ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా విడుదైన బార్క్ రేటింగ్స్‌లో టీవీ9 తెలుగు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సక్సెస్ టీవీ9 టీమ్ ఎఫోర్ట్‌గా ప్రకటించిన చానల్ హెడ్ రజనీకాంత్.. ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

TV9 Telugu: నెం.1గా జెండా ఎగరవేసిన టీవీ9.. తెలుగు మీడియా చరిత్రలో ఆల్‌టైమ్‌ హై రేటింగ్స్‌
Tv9 Telugu
Follow us
Ram Naramaneni

|

Updated on: May 18, 2023 | 2:40 PM

చర్రిత మళ్లీ రిపీట్ అయ్యింది. నంబర్ 1 న్యూస్ చానల్‌గా మరోసారి జయకేతనం ఎగరవేసింది టీవీ9. తెలుగుమీడియా చరిత్రలో ఆల్‌టైమ్‌ హై రేటింగ్స్‌తో టాప్‌లో నిలిచింది టీవీ9 తెలుగు.  టీవీ9కు గతంలానే తెలుగు రాష్ట్రాల ప్రజలు పట్టం కట్టారు. నిబద్దత, నిజాయితీతో వ్యహరిస్తూ వస్తున్న టీవీ9 తెలుగు.. తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. బాధ్యతాయుత జర్నలిజానికి మేలుకొలుపు టీవీ9 అని ఎలుగెత్తి చాటింది.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలు చూసిన ప్రేమాభిమానాలకు సవినయంగా కృతజ్ఞతలు చెబుతుంది టీవీ9. Tv9 NETWORK లోనే ఇప్పుడు టీవీ9 తెలుగు మకుటాయమానం.

ప్రేక్షకులారా.. 20 ఏళ్లుగా టీవీ9పై చెక్కుచెదరని మీ నమ్మకం అపురూపం.  No.1 స్థానాన్ని అందించిన మీ ఆదరణ అనిర్వచనీయం.  మీ ఆశలు, ఆకాంక్షలకు గొంతుకగా కొనసాగుతుంది టీవీ9 ప్రస్థానం.  వార్తలో వాయు వేగం.. అంతకుమించిన ఖచ్చితత్వం.. సమాజం సమస్యలను ఎటువంటి బెరుకు లేకండా ప్రజెంట్ చేయడం వంటివి టీవీ9 తెలుగును అగ్రస్థానంలో నిలబెట్టాయి.  ఎలక్షన్ కవరేజ్ అయినా, తుఫాన్ హెచ్చరికలు అయినా, మరో ప్రకృతి విపత్తు అయినా 100 శాతం నిబద్దతతో, సమాజం పట్ల బాధ్యతతో వార్తలను ప్రజంట్ చేసింది టీవీ9. కరోనా సమయంలో బాధిత, పీడిత ప్రజల బాధలను ప్రభుత్వాలకు తెలియజేసింది. అందుకే ఈ ప్రజలు టీవీ9 పక్షాన నిలబడి.. అగ్రస్థానాన నిలబెట్టారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్  వీక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పూర్తి అంకితభావంతో కష్టపడి పనిచేశాం. దీనితో పాటు మాకు ఇంత ప్రేమను అందించిన వీక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విజయంలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం ఉంది’ అని పేర్కొన్నారు.

20 ఏళ్ల ప్రస్థానం

20 సంవత్సరాల క్రితం తెలుగు ప్రజలకు ‘మెరుగైన సమాజం’ అనే నినాదం పరిచయమైంది . నినాదం కాదు విధానం కావాలి అని నిరంతర వార్తల తో మొదలైంది టీవీ9. వార్తలంటే ఇలా ఉండాలి , న్యూస్ ప్రేసెంటెర్ అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి అని ఎలక్ట్రానిక్ జర్నలిజంకి సరైన నిర్వచనం చెప్పింది టీవీ9 . నిస్పక్షపాతమైన వార్త కోసం టీవీ9, బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతున్నా కెమెరా పెట్టగలిగే దైర్యం టీవీ9, స్టింగ్ ఆపరేషన్ చేసి లంచాల పని పట్టిన ప్రజాపక్షం టీవీ9 , అధికారిక కేంద్రాలను కూడా నిలదీసిన పవర్ఫుల్ వాయిస్ టీవీ9 , ప్రలోభాలకు లొంగని ప్రతిభ తో 24 గంటలు సామాన్యుడి పక్షాన ప్రశ్నిస్తుంది కాబట్టే న్యూస్ లీడర్ అయి, ఇండియాస్ నెంబర్ వన్ న్యూస్ నెటవర్క్ గా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , గుజరాత్, కర్ణాటక , ముంబై , ఢిల్లీ , కోల్ కతా , ఇలా ప్రతి భాషకి దగ్గరై ఆత్మీయ ఛానల్ గా మారింది. ఎప్పటికప్పుడు సమాజాన్ని చైతన్యపరిచి పారాహుషార్ అనే ప్రజల ఊపిరి టీవీ9.

లాభాపేక్ష రహితంగా దాదాపు 30 సామాజిక అంశాలపై గళమెత్తి ప్రశ్నిస్తున్న ఏకైక ఛానెల్ టీవీ9. సాధారణమైన వ్యక్తి చేతిలో పదునైన ఆయుధం లా మారి నిలదీసే దైర్యం ఇచ్చింది టీవీ9. మెరుగైన సమాజమనే ఒకే సిద్ధాంతంతో ఒక్క అడుగుతో మొదలైన టీవీ9 నేడు మిలియన్ మార్చ్ లా కోట్లాది ప్రజల గుండెలకు చప్పుడు గా మారింది. టీవీ 9 అంటే వార్తలలో నిజం , సమన్వయము , దైర్యం , తప్పును నిలబెట్టి నిలదీసే తత్వం.

మూఢ నమ్మకాలను, కుల రాజకీయాలను సమూలంగా ఎండగట్టింది టీవీ9 . సామాన్యుల నిత్వవసరాల నుంచి, పెద్దవాళ్ళ మాఫియా దందాలా దాకా ప్రతి ఒక్క దానిని కన్నార్పకుండా చూస్తూ నిజం నిగ్గు తేల్చడమే టీవీ 9 ఉద్దేశం. 20 సంవత్సరాల ప్రయాణంలో టీవీ 9 నేషనల్ , రీజినల్ , సేన్సేషనల్ అవార్డ్స్ని ఎన్నో గెలిచింది. ఎవరూ పోటీ పడలేనంత ఖచ్చితత్వం టీవీ 9. తరాలు మారినా చెక్కు చెదరని నమ్మకం టీవీ9.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..