TSRTC: ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం.. టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’..!
తీవ్ర నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసి చేస్తున్న సంస్కరణలు ఒక్కక్కోటి మంచి ఫలితాలు ఇస్తుండడంతో మరో కొత్త విధానాన్ని తీసుకోచ్చింది. విమానాలు, పెద్ద పెద్ద హోటల్స్‌లో ఉండే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ ని ప్రవేశపెట్టింది.

తీవ్ర నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసి చేస్తున్న సంస్కరణలు ఒక్కక్కోటి మంచి ఫలితాలు ఇస్తుండడంతో మరో కొత్త విధానాన్ని తీసుకోచ్చింది. విమానాలు, పెద్ద పెద్ద హోటల్స్‌లో ఉండే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా దూరపు ప్రాంత ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించేందుకు సరికొత్త ప్రణాళికలతో ఆర్టీసి ముందుకు వచ్చింది.
తెలంగాణ ఆర్టీసి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతుంది. టికెట్ ఆదాయాన్ని పెంచుకోవడానికి దూరపు ప్రాంత ప్రయాణికులు ఆర్టీసీ వైపు వచ్చేలా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఫైలట్ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్ ప్రైసింగ్‌ను.. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయమున్న సర్వీస్‌లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తుంది.
ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చు తగ్గులు జరగడమే డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉంటుందని.. రద్దీ తక్కువగా ఉంటే సాధారణ చార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్ ధర ఉంటుందన్నారు ఎండి సజ్జనార్. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో అడ్వాన్స్‌డ్ డేటా అనాలసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్ ధరను వెల్లడిస్తాయని సజ్జనార్ తెలిపారు.




“సాధారణ రోజుల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లు అధికంగా చార్జీలు వసూలుచేస్తున్నారు. రద్దీ రోజుల్లో అయితే టికెట్ల ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారు. ప్రైవేట్ పోటీని తట్టుకుని.. ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విధానం వల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణ చార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది.” ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు… సర్వీస్ ప్రారంభమయ్యే గంట ముందు వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు..రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రయాణికులను ఆకర్శించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ప్రయాణికులు మంచిగా ఆదరిస్తున్నారని అన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లుతెలిపారు.
ఆర్టీసి లో అమలవుతున్న సంస్కరణలు పలిస్తుండడం తో గతం లో కన్నా ఆదాయం సైతం భారీగా పెరుగుతుంది.. ఇప్పుడు తాజాగా తీసుకోచ్చిన డైనమిక్ ప్రైసింగ్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
