AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు మరో గుడ్‌న్యూస్‌.. నానాక్‌రామ్‌గూడలో యూఎస్‌ కాన్సులేట్‌ బిల్డింగ్

హైదరాబాదీలకు మరో గుడ్‌న్యూస్‌..! నానాక్‌రామ్‌గూడలో అత్యాధునిక సదుపాయాలతో యూఎస్‌ కాన్సులేట్‌ భవనం ప్రారంభమైంది. బేగంపేట పైగా ప్యాలెస్‌లో ఉన్న కాన్సులేట్‌ సేవలను కొత్త క్యాంపస్‌కు తరలించారు.

Hyderabad: హైదరాబాదీలకు మరో గుడ్‌న్యూస్‌..  నానాక్‌రామ్‌గూడలో యూఎస్‌ కాన్సులేట్‌ బిల్డింగ్
US Consulate In Nanakramguda
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2023 | 8:40 PM

Share

హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లోని నానక్‌రామ్‌గూడలో యూఎస్‌ కాన్సులేట్‌ కొత్త భవనం మార్చి 20న ప్రారంభమైంది. ఒకటిన్నర దశాబ్దాలుగా బేగంపేట పైగా ప్యాలెస్‌లో సేవలందించిన యూఎస్‌ కాన్సులేట్‌ ఇకపై కొత్త క్యాంపస్‌ నుంచి అందిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించారు. వీసాకు సంబంధించిన ఇంటర్వ్యూలు మాత్రం నానక్‌రామ్‌గూడలోని యూఎస్‌ కాన్సులేట్‌ భవనంలో ఉంటాయని కాన్సులేట్‌ జనరల్ సూచించింది. బయోమెట్రిక్‌ అపాయింట్‌మెంట్‌లు, డ్రాప్‌బాక్స్‌, పాస్‌పోర్ట్‌ పికప్‌తో సహా ఇతర వీసా సేవలు మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌లోని దిగువ కాన్‌కోర్స్‌లో ఉన్న వీసా అప్లికేషన్‌ సెంటర్‌లో కొనసాగుతాయి.

నానక్‌రామ్‌గూడలోని యూనెటైడ్‌ స్టేట్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పౌరులకు సేవలు అందిస్తుంది. అమెరికా-భారత్‌ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ అధికారులు, వ్యాపార, వాణిజ్య, సాధారణ ప్రజలకు దౌత్య, సాంస్కృతిక సంబంధాల కోసం కాన్సులేట్‌ పనిచేస్తుంది. ఇక్కడి నుంచి యూఎస్‌ వెళ్లాలనుకునే పౌరులకోసం అధికారిక, పర్యాటకం, వ్యాపారం, విద్యా ప్రయోజనాల కోసం వెళ్లే వారికి వీసా సేవలను అందిస్తుంది.

హైదరాబాద్‌లోని ఈ సరికొత్త కాన్సులేట్‌ భవనం కోసం అమెరికా 340 మిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. ఓ కార్పొరేట్‌ కంపెనీల లుక్‌ వచ్చేలా దీన్ని డిజైన్‌ చేశారు. ఇలాంటి కాన్సులేట్‌ భవనం ప్రపంచంలో ఎక్కడా లేదని చెబుతున్నారు అమెరికన్‌ ఇంజనీర్లు. హైదరాబాద్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీ కావడంతో.. ఇక్కడ భారీ స్థాయిలో సౌత్‌ ఆసియాలోనే అతిపెద్ద కాన్సులేట్‌ భవనాన్ని నెలకొల్పామంటున్నారు కాన్సులేట్‌ అధికారులు. అంతేకాదు అమెరికా – భారత్‌ల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?