TGSRTC Jobs 2026: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నియామక పరీక్ష తేదీని టీజీఎస్ ఆర్టీసీ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మార్చి 29వ తేదీన రాత పరీక్ష నిర్వహించనుంది..

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నియామక పరీక్ష తేదీని టీజీఎస్ ఆర్టీసీ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మార్చి 29వ తేదీన రాత పరీక్ష నిర్వహించనుంది. మార్చి 29న ఉదయం సెషన్‌లో టీఎస్‌టీ పోస్టుకు ఉదయం 10 గంటలకు పరీక్ష ఉంటుంది. ఎంఎస్‌టీ పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటలకు రాత పరీక్ష జరుగుతుందని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఛైర్మన్ వివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 84 టీఎస్‌టీ పోస్టులకు 20,097 మంది, 114 ఎంఎస్‌టీ పోస్టులకు 6,063 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీందరికీ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.
తెలంగాణ గురుకుల టీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఐదో తరగతితో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు టీజీసెట్ 2026 దరఖాస్తు గడువు జనవరి 25 వరకు పొడిగిస్తున్నట్లు గురుకుల సెట్ చీఫ్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.44 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అభ్యర్థులు తుది గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే సవరణలకు జనవరి 25 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
