AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Talasani : ఇది పట్టభద్రులు, ఉద్యోగుల గెలుపు. నోటికొచ్చినట్లు మాట్లాడే పార్టీలకు చెంప పెట్టు : తలసాని

TS Minister Talasani srinivas yadav : నోటికొచ్చినట్లు మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకు పట్టభద్రుల MLC ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు అన్నారు తెలంగాణ.

Talasani : ఇది పట్టభద్రులు, ఉద్యోగుల గెలుపు. నోటికొచ్చినట్లు మాట్లాడే  పార్టీలకు చెంప పెట్టు : తలసాని
talasani srinivas yadav
Venkata Narayana
|

Updated on: Mar 20, 2021 | 6:14 PM

Share

TS Minister Talasani srinivas yadav : నోటికొచ్చినట్లు మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకు పట్టభద్రుల MLC ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తుందని ఆ ఫలితమే ఈ ఫలితాలని ఆయన వ్యాఖ్యానించారు. TRS ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఉన్న నమ్మకంతోనే పట్టభద్రుల MLC ఎన్నికలలో సురభి వాణి దేవిని డిగ్రీ హోల్డర్లు గెలిపించారన్నారాయన.

విద్యారంగ సమస్యలు, పట్టభద్రుల సమస్యలపై ఎంతో అనుభవం ఉన్న సురభి వాణి దేవి గెలుపు పట్టభద్రులు, ఉద్యోగుల గెలుపు అని తలసాని చెప్పారు. ఈ ఎన్నికలలో పట్టభద్రులు, ఉద్యోగులు ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పారు.. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పద్దతి మార్చుకోవాలి అని తలసాని కోరారు.

Read also : TRS MLC Surabhi Vanidevi : పట్టభద్రుల ఎమ్మెల్సీగా జయకేతనం, ఇంతకీ.. ఎవరీ సురభి వాణీదేవి.? ఆమె ప్రస్థానమేంటి?, ఆమె పయనమెలా..?