AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు..

Telangana Bhavan Fire Mishap: హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో తెరాస అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. సురభి వాణీదేవీ విజయం పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి

Breaking News: తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు..
Fire Accident Trs Bhawan
Shaik Madar Saheb
| Edited By: Team Veegam|

Updated on: Mar 20, 2021 | 7:50 PM

Share

Telangana Bhavan Fire Mishap: హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో తెరాస అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో సురభి వాణీదేవీ విజయం పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ సంబరాల్లో అపశృతి నెలకొంది.  టపాసులు పేల్చుతుండగా టీఆర్ఎస్ భవనంలోని పైకప్పుకు మంటలు అంటుకున్నాయి. దీంతో భవనం పైకప్పులో మంటలు వ్యాపించాయి.

అప్రమత్తమైన పోలీసులు అక్కడ ఉన్న వారందరినీ బయటకు పంపివేశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గెలుపు సంబరాల్లో భాగంగా.. కార్యకర్తలు, నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ క్రమంలో టపాసులు పేలుస్తుండగా.. భవనం పై అంతస్తునున్న ఎండుగడ్డికి మంటలు అంటుకున్నాయి. దీంతోమంటలు చెలరేగినట్లు అక్కడున్న వారు తెలిపారు.

Telangana Bhavan Fire Accident

Also Read: బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఆరు రోజులు బ్యాంకులు బంద్.. వివరాలివే.!!

దాహం తీర్చుకుంటున్న జింక.. కన్నేసిన మొసలి.. కట్ చేస్తే అదిరిపోయే ట్విస్ట్.!

ప్రపంచంలోనే అతిభయంకరమైన ప్లేస్ ఈ ద్వీపం.. నో ఎంట్రీ బోర్డు తగిలించేశారు.. అడుగుపెట్టారా అంతే