Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Island : ప్రపంచంలోనే అతిభయంకరమైన ప్లేస్ ఈ ద్వీపం.. నో ఎంట్రీ బోర్డు తగిలించేశారు.. అడుగుపెట్టారా అంతే

ప్రపంచంలో ఏ మానవమాత్రుడు అడుగు పెట్టలేని పెట్టకూడని ప్రాంతాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు.. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీంతో ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. వీటిని మనమెప్పుడూ చూడలేదు...

Snake Island  : ప్రపంచంలోనే అతిభయంకరమైన ప్లేస్ ఈ ద్వీపం.. నో ఎంట్రీ బోర్డు తగిలించేశారు.. అడుగుపెట్టారా అంతే
Snake Island In Brazil
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 20, 2021 | 7:59 AM

Snake Island : ప్రపంచంలో ఏ మానవమాత్రుడు అడుగు పెట్టలేని పెట్టకూడని ప్రాంతాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు.. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీంతో ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. వీటిని మనమెప్పుడూ చూడలేదు. ఇకపై ఆ ప్రాంతాలను సందర్శించలేము. కొన్ని పాంతాల్లో మానవ మాత్రుడు కూడా అడుగుపెట్టలేడు పెట్టకూడదు కూడా..! కొన్ని ప్రాంతాలకు నిషేధాజ్ఞలు పరిమితమైతే.. కొన్ని చోట్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకనే ఆ ప్రాంతాలను సందర్శించడానికి అనుమతులను నిరాకరిస్తూ.. నో ఎంట్రీ బోర్డు తగిలించేశారు.. ఇప్పుడు ఆలాంటి ఓ ప్రమాదకరమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం..

భూమ్మీద ఉన్న భయంకరమైన స్థలంగా దీన్ని భావించొచ్చు. ఓఫిడిఫోబియో ఉన్నవాళ్లను ఇక్కడకు పంపిస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఇంతకీ ఈ ఫోబియా ఏంటంటే.. పాములను చూస్తే వీరికి చచ్చేంత భయం. భూమి మీద ఉన్న భయంకరమైన స్థలంగా నిషేధ అజ్ఞాలున్న మొదటి ప్లేస్ లో నిలిచింది బ్రెజిల్ లోని సావో పౌల్.. ఇల్హా డా క్యూమాడా గ్రాండే.. అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ తీరంలో ఉన్న ఒక ద్వీపం దీనినే స్నేక్ ఐలాండ్ గా కూడా పిలుస్తారు. దాదాపు 110 ఎకరాల్లో 430,000 పాములు సంచరిస్తుంటాయని సైంటిస్టులు అంచనా వేసి మరీ చెప్పారు. పైగా ఇక్కడ ఉన్న పాములు మిగతా పాములతో పోలిస్తే చాలా బలమైనవి. కొన్ని పాములకు ఏకంగా మనిషిని పీల్చి పిప్పి చేయగల సామర్థ్యం కూడా ఉంటుందట. మరికొన్ని పాములు చాలా విషపూరితమైనవని పరిశోధనల్లో తేలింది. ఇక్కడ ఇతర జీవరాశులు బతుకడం కష్టమని కూడా తేల్చేశారు. చిన్నా చితకా పక్షులను అవి పొట్టన పెట్టుకోవడమే ఇందుకు కారణమట. అందుకే, ఈ ప్రాంతం నిషేధ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది.

పాముల నుంచి ప్రమాదం పొంచి ఉడడంతో బ్రెజిల్ ఈ ప్రాంతంలో సంచరించడం చట్టవిరుద్ధం చేసింది. ఈ ద్వీపంలో ప్రమాదం బంగారు లాన్స్‌హెడ్ పాముల రూపంలో వస్తుంది. ప్రపంచంలోని ప్రాణాంతక సర్పాలలో ఒకటి. లాన్స్ హెడ్స్ ఒకటిన్నర పొడవు వరకు పెరుగుతాయి. ఈ జాతి పాములు ఈ ద్వీపంలో 2,000 మరియు 4,000 పాములు ఉన్నాయని అంచనా వేశారు. ఈ లాన్స్ హెడ్స్ చాలా విషపూరితమైనవి.. ఇవి కరిస్తే గంటలోపు మరణం సంభవించడం ఖాయమట..

అయితే ఇప్పుడు స్నేక్ ద్వీపం ఇప్పుడు జనావాసాలు కాదు.. కానీ 1920 ల చివరి వరకు ప్రజలు నివసించేవారని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న నిధిని రక్షించుకోవడానికి సముద్రం దొంగలు పాములను కాపలాగా పెట్టారని.. అవి ఇప్పుడు ఈ రేంజ్ లో పెరిగాయని చరిత్రకారుల కథనం. ఇక్కడ ఉన్న అరుదైన పాము జాతుల నుంచి వచ్చే విషం కొని రకాల గుండె జబ్బులకు ఉపయోగపడుతుందట. దీంతో ఈ విషానికి బ్లాక్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. అందువల్లనే చాలా మంది ప్రాణాలకు తెగించి మరీ ఈ దీపంలో పాములను పట్టుకోవడానికి వెళ్తారట.. ఈ దీపంలోకి అడుగు పెట్టకుండా నావీ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తుంది.

10వేల ఏళ్ల క్రితం ఈ స్నేక్ దీపం కూడా బ్రెజిల్ యొక్క ప్రధాన భూభాగంలో భాగంగా ఉండేది. అయితే సముద్ర మట్టాలు పెరిగినప్పుడు, అది భూభాగాన్ని వేరు చేసి ద్వీపంగా మార్చింది.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి

Also Read:  బ్రహ్మత్సవాల్లో ఉపయోగించే పల్లకిని ఏ రాజు గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా.. అది దేనితో తయారైందంటే..!

 రిటైర్డ్ హార్ట్‌గా టోర్నీ నుంచి ఔట్.. తొడ కండరం నొప్పితో తప్పుకున్న సైనా నెహ్వాల్..