AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS MLC Surabhi Vanidevi : పట్టభద్రుల ఎమ్మెల్సీగా జయకేతనం, ఇంతకీ.. ఎవరీ సురభి వాణీదేవి.? ఆమె ప్రస్థానమేంటి?, ఆమె పయనమెలా..?

TRS MLC Surabhi Vanidevi : సురభి వాణీదేవి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైద‌రాబాద్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా రంగంలోకి..

TRS MLC Surabhi Vanidevi : పట్టభద్రుల ఎమ్మెల్సీగా జయకేతనం, ఇంతకీ.. ఎవరీ సురభి వాణీదేవి.? ఆమె ప్రస్థానమేంటి?, ఆమె పయనమెలా..?
Surabhi Vanidevi
Venkata Narayana
|

Updated on: Mar 20, 2021 | 6:04 PM

Share

TRS MLC Surabhi Vanidevi : సురభి వాణీదేవి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైద‌రాబాద్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగి జయకేతనం ఎగురవేసిన తెలంగాణ బిడ్డ. తెలుగు ప్రజల ముద్దుబిడ్డ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి కుమార్తే ఈ వాణీదేవి. తన తండ్రి నేర్చుకున్న 18వ భాష మౌన భాషని, అదే తరహాలో తన ప్రయాణం సాగుతుండటం వల్లే ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నానని వాణీదేవి పలు మార్లు చెప్పారామె.

వాణీదేవి క్రియాశీలక జీవితంలో ఎక్కువ భాగం విద్యారంగంలోనే వాణీదేవి సేవలందించారు. తద్వారా ఎంతోమందికి ఉపాది, ఉద్యోగ అవకాశాల కల్పనకు కారణమయ్యారు. ఈ రంగం ద్వారా మరింత మందికి సేవచేసే ఉద్దేశ్యంతోనే రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నానంటూ వాణీదేవి పొలిటికల్ అరంగేట్రం చేశారు. భారతమాత ముద్దుబిడ్డ, స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహరావు వారితో అనేక విదేశీ పర్యటనల్లో వాణీదేవి పాల్గొన్నారు.

అంతేకాదు, హైదరాబాద్‌ నగరంలో వాణీ మేడమ్ విద్యాసంస్థలు అందరికీ సుపరిచితమే. లక్షలాది మంది విద్యార్థులు, విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులవ్వడంలో వాణీదేవి పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు, కళలు, సాహిత్యరంగంలో తెలంగాణ వెనక్కి నెట్టబడిందన్న అభిప్రాయం ఉన్న ఆమె, తెలంగాణ సాహితీ పరిమళాలు వికసింప చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వాణీదేవి చెబుతుంటారు. వంగర గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో తిరగిన అనుభవం, పొలం పనులపైన వాణీదేవికి అపూర్వమైన ప్రేమాభిమాభిమానాలు ఆమె కున్న సామాజిక స్పృహకు తార్కాణాలుగా నిలుస్తాయి.

ఇక, సురభివాణి ప్రొపైల్ క్లియర్ పిక్చర్ మీకోసం :

ఏప్రిల్ 1, 1952న కరీంగనర్ జిల్లా వంగరలో జననం హైదరాబాదు హైదర్‌గూడలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 1968లో హెచ్ఎస్సీ పూర్తి హైదరాబాద్ ఆబీ వీఆర్ ఆర్ కాలేజి లో 1970లో పీయూసీ పూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1973లో బిఏ పూర్తి 1986లో జేఎన్టీయూలో డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి 1990-1995 వరకు జేఎన్టీయూ లెక్చరర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించిన వాణీిదేవీ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె జెఎన్‌టియు నుండి ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా పూర్తిచేసిన వాణీ దేవీ.

పలు విద్యా సంస్థలు స్థాపించిన వాణీదేవి… హైదరాబాద్ మాదాపూర్‌లో శ్రీ వెంకటేశ్వరా కాలేజీ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, కాలేజీ ఆఫ్‌ ఫార్మసీ, కాలేజీ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ హైదరాబాద్‌ బేగంపేటలో స్వామి రామానందతీర్ధ మెమోరియల్‌ మోడల్‌ స్కూల్‌ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ లో సురభి దయాకర్‌రావు ఫార్మసీ కళాశాల కరీంనగర్‌ జిల్లా ముల్కనూరు లో స్వామి రామానందతీర్ధ సహకార జూనియర్‌ కళాశాల పలు విద్యా సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్న వాణి దేవి సామాజిక కార్యకర్తగా స్వామి రామానంద తీర్థ స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శిగా పదవులు నిర్వహించిన వాణీ దేవీ గత 3 దశాబ్దాలుగా విద్యారంగంలో కృషిచేస్తోన్న వాణీ దేవి విద్యావేత్తగా, చిత్రకారిణిగా, సంఘ సేవకురాలిగా గుర్తింపు పీవీ శతజయంతి వేళ వాణీదేవి గెలుపు ఆయనకు ఘన నివాళిగా భావిస్తున్న విద్యావేత్తలు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సురభి ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించిన వాణీ దేవీ చిత్రకారిణిగా 1973 నుండి దేశవిదేశాల్లో 15కి పైగా సోలో ఎగ్జిబిషన్లు అనేక గ్రూప్ షోలు, సెమినార్లు నిర్వహించిన వాణీ దేవీ 35 ఏళ్లుగా వందలాది పెయింటింగ్స్‌ వేసిన వాణీదేవి తన పెయింటింగ్స్‌తో ఇప్పటివరకూ 15 ఎగ్జిబిషన్లు కూడా నిర్వహణ అమెరికా రాజధాని వాషింగ్టన్‌-డీసీ లో ఉన్న గాంధీ మెమోరియల్‌ సెంటర్‌లో ఎగ్జిబిషన్ సారే జహాసె అచ్ఛా పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించిన వాణీదేవి

సమాజ సేవలో… బేగంపేటలోని స్వామి రామానందతీర్ధ మెమోరియల్‌ కమిటీకి ఇంచార్జి చైర్‌పర్సన్‌గా, ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న వాణీదేవి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ జ్యూరీ మెంబర్‌గా, సెలక్షన్‌ కమిటీ మెంబర్‌గా సేవలు ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారాల ఎంపిక కమిటీ జ్యూరీలో సభ్యురాలిగా పనిచేసిన వాణీదేవి

వచ్చిన పురస్కారాలు.. 2012.. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం 2014.. ఐఐఈఎం ఢిల్లీ నుంచి బెస్ట్ ఎడ్యుకేషన్స్ అవార్డు 2015.. టీఆర్ ఎస్ నుంచి విశిష్ట మహిళా పురస్కారం 2016.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఆచీవ్ మెంట్ అవార్డ్ 2019.. శ్రీకృష్ణదేవరాయాంద్ర భాషా నిలయం నుంచి రావిచెట్టు లక్ష్మీ నర్సమ్మ సంస్కార పురస్కారం 2019… రేడియో సిటీ హైదరాబాద్ నుంచి శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజీ, కాలేజీ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కు హైదరాబాద్ సిటీ ఐకాన్ అవార్డులు.

Read also : Kamal Haasan injured : ఒక్కసారిగా మీదపడ్డ అభిమానులు, డాక్టర్ల సూచనతో ఎన్నికల ప్రచారం నిలిపివేసిన కమల్ హాసన్