TS ICET 2023 Counselling: తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
తెలంగాణ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. తాజాగా విడుదలైన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 14 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 2 నుంచి ఎంసెట్ ఫార్మా..
హైదరాబాద్, జులై 14: తెలంగాణ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. తాజాగా విడుదలైన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 14 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 2 నుంచి ఎంసెట్ ఫార్మా (బైపీసీ విద్యార్థులకు) కౌన్సెలింగ్‌లు జరుగుతుంది. ఈ మేరకు తెలియజేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యార్ధులకు సూచించింది. అలాగే ఈసెట్ ప్రవేశాల ప్రక్రియకు కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి మొదలవుతుంది. ఈసెట్‌లో ఉత్తీర్ణులైన పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం విద్యార్థులు బీటెక్, బీఫార్మసీలో నేరుగా రెండో ఏడాదిలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఎంసెట్ ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిదే.
తెలంగాణ ఈసెట్-2023 కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
- జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు తొలి విడత స్లాట్ బుకింగ్
- జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన
- జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
- ఆగస్టు 8వ తేదీన సీట్ల కేటాయింపు
- ఆగస్టు 8 నుంచి 12 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాలి అలాగే వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది
- ఆగస్టు 20 నుంచి 30 వరకు చివరి విడత కౌన్సెలింగ్
తెలంగాణ ఐసెట్-2023 కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
- ఆగస్టు 14 నుంచి 18 వరకు స్లాట్ బుకింగ్
- ఆగస్టు 16 నుంచి19 వరకు ధ్రువపత్రాల పరిశీలన
- ఆగస్టు 16 నుంచి 21 వరకు: వెబ్‌ఆప్షన్ల నమోదు
- ఆగస్టు 25న సీట్ల కేటాయింపు
- ఆగస్టు 25 నుంచి 28 వరకు ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది
- సెప్టెంబరు 1 నుంచి 9 వరకు చివరి విడత కౌన్సెలింగ్
తెలంగాణ ఎంసెట్-2023 ఫార్మా కౌన్సెలింగ్
- సెప్టెంబరు 2 నుంచి 3 వరకు స్లాట్ బుకింగ్
- సెప్టెంబరు 4 నుంచి 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన
- సెప్టెంబరు 4 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
- సెప్టెంబరు 11వ తేదీన సీట్ల కేటాయింపు
- సెప్టెంబరు 11 నుంచి 14 వరకు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
- సెప్టెంబరు 17 నుంచి 26 వరకు చివరి విడత కౌన్సెలింగ్
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.