పీఆర్సీ రిపోర్టుపై తెలంగాణ ఉద్యోగ సంఘాల అసంతృప్తి.. త్రిసభ్య కమిటీ భేటీపై ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠ

లంగాణ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ రిపోర్ట్ వచ్చింది. అయితే కమిషన్ నివేదిక వచ్చిందో? లేదో? ఉద్యోగ సంఘాలు ఒంటికాలిపై..

పీఆర్సీ రిపోర్టుపై తెలంగాణ ఉద్యోగ సంఘాల అసంతృప్తి.. త్రిసభ్య కమిటీ భేటీపై ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠ
Follow us

|

Updated on: Jan 27, 2021 | 2:34 PM

లంగాణ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ రిపోర్ట్ వచ్చింది. అయితే కమిషన్ నివేదిక వచ్చిందో? లేదో? ఉద్యోగ సంఘాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. పీఆర్సీ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఫిట్‌మెంట్‌ సరిగా లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయంపై సీఎస్‌తోనే తేల్చుకోవాలని ఉద్యోగులు భావిస్తునన్నారు.

తొలి వేతన సవరణ నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టింది కమిషన్‌. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ పెంపును ప్రతిపాదించింది. కనీస వేతనం 19 వేలు రూపాయలుగా, గరిష్ట వేతనం లక్షా 62వేలుగా ఉండాలని చెప్పింది పీఆర్సీ కమిటీ. HRAని 30 నుంచి 24 శాతానికి కుదించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ప్రతిపాదించింది. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ డిసెంబర్ 31న ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది.

టీఎన్జీవోలు, టీజీవోలతో సీఎస్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏం చర్చించబోతుందనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగుల సమస్యలను విన్నవించుకోవడంతో పాటు.. పీఆర్సీ నివేదికపైనా ఇరు వర్గాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో ఏం చెప్పబోతున్నారు? సర్కారు వ్యూహమేంటి? ఉద్యోగుల డిమాండ్లేంటి? ఇవే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.

భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది… అయితే.. కండీషన్స్‌ అప్లై అంటున్న సీఐసీ