TS SSC Supplementary Result: తెలంగాణ టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రేపే సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..

TS SSC Supplementary Result 2022: తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అధికారులు వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ 10వ తరగతి...

TS SSC Supplementary Result: తెలంగాణ టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రేపే సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..
TS 10th Supply Results

Updated on: Sep 01, 2022 | 8:17 PM

TS SSC Supplementary Result 2022: తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అధికారులు వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 2 (శుక్రవారం) టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నారు. సైఫాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

నిజానికి సెప్టెంబర్‌ 10వ తేదీలోపు పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావించారు. కానీ తెలిపిన సమయం కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫెయిల్ అయిన వారి కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి నిర్వహించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..