TS 10th Class Evaluation 2023: నేటి నుంచి ప్రారంభమైన తెలంగాణ ‘పది’ జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు నేటితో ముగిశాయి. ప్రధాన పరీక్షలన్నీ ఏప్రిల్ 11తో ముగియగా.. 12, 13 తేదీల్లో సంస్కృతం, అరబిక్ ల్యాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఫలితాలను ఆలస్యం చేయకుండా..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు నేటితో ముగిశాయి. ప్రధాన పరీక్షలన్నీ ఏప్రిల్ 11తో ముగియగా.. 12, 13 తేదీల్లో సంస్కృతం, అరబిక్ ల్యాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఫలితాలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన విద్యార్థులకు అందించడానికి జవాబు పత్రాల మూల్యాంకనానికి హనుమకొండ కాజీపేట ఫాతిమనగర్‌లోని ఫాతిమా ఎయిడెడ్ బాలికల ఉన్నత పాఠశాల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం (ఏప్రిల్ 13) నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది.
నేటి నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం కొనసాగుతుంది. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 950 మంది, ప్రత్యేక అసిస్టెంట్లు 350 మంది మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే హనుమకొండ జిల్లా కేంద్రానికి 2.90 లక్షల పదో తరగతి జవాబు పత్రాలు చేరాయి. పది స్పాట్ వాల్యుయేషన్ అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎండీ అబ్దుల్‌హై వ్యవహరిస్తున్నారు. మే 10 తర్వాత అంటే నెల రోజుల్లోపు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.