Munugode Bypoll: మునుగోడులో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న కారు.. తెలంగాణ భవన్‌లో అంబరాన్నింటిన సంబరాలు..

కౌంటింగ్‌ ఇంకా పూర్తి కాకుండానే టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ భవన్‌లో ఆపార్టీ నేతలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.

Munugode Bypoll: మునుగోడులో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న కారు.. తెలంగాణ భవన్‌లో అంబరాన్నింటిన సంబరాలు..
Trs Party

Updated on: Nov 06, 2022 | 4:47 PM

ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కారు జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోంది. దాదాపు అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యం సంపాదిస్తోంది. ఇక కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి భారీ మెజార్టీ దూసుకెళుతున్నారు. ఈనేపథ్యంలో కౌంటింగ్‌ ఇంకా పూర్తి కాకుండానే టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు మొదలయ్యాయి.ఈ క్రమంలో  అప్పుడే తెలంగాణ భవన్‌లో డప్పులు మోగిస్తూ, బాణాసంచా కాల్చూతూ సంబరాలు చేసుకుంటున్నారు.   కాగా మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పటి వరకు 11 రౌండ్లు పూర్తయే సరికి  టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల 5774 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రౌండ్ల వారీగా ఆధిక్యాన్ని గమనిస్తే.. 1,4,5 రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉండగా, రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ లీడ్‌ చూపించింది. తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6వేల 418 ఓట్లు రాగా.. బీజేపీకి 5వేల 126 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 2వేల 100 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 12వందల 92 ఓట్ల లీడ్‌ సాధించింది. ఇక రెండో రౌండ్‌కు వచ్చేసరికి.. బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. ఈ రౌండ్‌లో కారు గుర్తుకు 7వేల 781ఓట్లు పడగా.. కమలం గుర్తుకు 8వేల662 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు కేవలం 15వందల 37 ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్‌లో బీజేపీకి 841 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

ఇక మూడో రౌండ్‌లోనూ బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 7వేల 390ఓట్లు రాగా, బీజేపీకి 7వేల 426 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి 19వందల 26 ఓట్లు పొందారు. ఈ రౌండ్‌లో బీజేపీకి 415 ఓట్ల ఆధిక్యం వచ్చింది. నాలుగో రౌండ్‌కు వచ్చేసరికి పరిస్థితి మళ్లీ మారింది. ఈసారి కారు పార్టీ.. మళ్లీ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4854 ఓట్లు రాగా, బీజేపీకి 4వేల 555 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 18వందల17 ఓట్లొచ్చాయి. 299ఓట్ల ఆధిక్యం సాధించింది టీఆర్‌ఎస్‌. ఐదో రౌండ్‌లో కారు పార్టీ మరింత దూకుడుగా దూసుకెళ్లింది. టీఆర్‌ఎస్‌కు 6,122, బీజేపీకి 5,245 ఓట్లొచ్చాయి. ఈరౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 917ఓట్ల లీడ్‌ సాధించింది. రౌండ్‌ రౌండ్‌కు మారిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితంలో… అధిక్యం అంతకంతకూ టీఆర్‌ఎస్‌ వైపు మళ్లింది. ఆరో రౌండ్‌కు వచ్చేసరికి కారు గేరు మార్చింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌ కు 6016, బిజేపీకి 5, 378 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ – 7189, బీజేపీకి -6803 ఓట్లు వచ్చాయి. 8వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6624, బీజేపీకి 6088 ఓట్లు వచ్చాయి. ఇక 9వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7497, బీజేపి కి 6665 ఓట్లు వచ్చాయి. ఇక పదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7499, బీజేపీకి 7015 ఓట్లు వచ్చాయి.

టీఆర్ఎస్‌ను దెబ్బ తీస్తోన్న కారును పోలిన గుర్తులు..

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని.. కారును పోలిన గుర్తులు దెబ్బ తీస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవీఎంలలో కారు మాదిరిగా చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులు ఉన్నాయి. వాటికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి చపాతీ రోలర్‌కు 1368, రోడ్డు రోలర్‌కు 1060 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..