Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Poaching Case: ఫామ్‌హౌస్‌ కేసులో వారికి ఊరట..! సిట్‌ నోటీసులపై స్టే పొడిగింపు.. మళ్లీ విచారణ ఎప్పుడంటే..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఏడుగురిని నిందితులుగా చేర్చింది. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీని కస్టడీకి తీసుకొని విచారించింది.

MLA Poaching Case: ఫామ్‌హౌస్‌ కేసులో వారికి ఊరట..! సిట్‌ నోటీసులపై స్టే పొడిగింపు.. మళ్లీ విచారణ ఎప్పుడంటే..?
Ts High Court
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 05, 2022 | 9:55 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఏడుగురిని నిందితులుగా చేర్చింది. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీని కస్టడీకి తీసుకొని విచారించింది. అయితే, ఇదే కేసులో బీజేపీ నేత BL సంతోష్‌తోపాటు.. కేరళ డాక్టర్ జగ్గుస్వామిని విచారిస్తే మరిన్ని కీలక వివరాలు వెల్లడవుతాయని భావిస్తోంది సిట్. అయితే విచారణకు రావాలంటూ సిట్‌ జారీ చేసిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై స్టే విధించాలంటూ ఈ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్.. ఇప్పటికే సంతోష్‌కు పలుమార్లు అవకాశం కల్పించినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. స్టేను ఎత్తేసి.. విచారణకు హాజరు అయ్యేలా ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషనర్ సంతోష్‌కి సంబంధించిన వాదనలు కూడా ఇంకా వినాల్సి ఉందని.. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సిట్ కు హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్‌కి మధ్యవర్తిగా డాక్టర్ జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ ఆరోపిస్తోంది. అందుకే ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా కోర్టును ఆశ్రయించడంతో…కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశించింది న్యాయస్థానం. ఈ నెల 13వ తేదీ వరకు సిట్‌ నోటీసులపై స్టే విధించింది. తదుపరి విచారణ వరకు సంతోష్‌, జగ్గుస్వామిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఇప్పటికే ఓ నివేదికను హైకోర్టుకు సమర్పించారు పోలీసులు.. కేసు దర్యాప్తు పురోగతితోపాటు.. పలు ఆధారాలను అందజేశారు. ఆ వివరాల ఆధారంగానే ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. ఇప్పటికే నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాదులు శ్రీనివాస్, ప్రతాప్‌గౌడ్‌లను ఎంక్వైరీ చేసింది సిట్. ఇప్పటికే ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. మరి 13వ తేదీన హైకోర్టు ఏం చెబుతుంది? సంతోష్, జగ్గుస్వామికి 41-A నోటీసులు ఇచ్చేందుకు అనుమతిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..