Delhi Liquor Scam: హైదరాబాద్‌ చేరుకున్న ఢిల్లీ సీబీఐ బృందం.. కవిత హాజరుపై సర్వత్రా ఉత్కంఠ..!

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈడీ రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం, సీబీఐ నోటీసులు ఇవ్వడం సంచలనం రేపింది.

Delhi Liquor Scam: హైదరాబాద్‌ చేరుకున్న ఢిల్లీ సీబీఐ బృందం.. కవిత హాజరుపై సర్వత్రా ఉత్కంఠ..!
Mlc Kavitha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 05, 2022 | 8:31 PM

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈడీ రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం, సీబీఐ నోటీసులు ఇవ్వడం సంచలనం రేపింది. 6వ తేదీన విచారణకు సిద్ధమంటూ పేర్కొన్న కవిత.. ఆ తర్వాత సీబీఐకి లేఖ కూడా రాశారు. ఫిర్యాదు ఒరిజినల్ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీ అందించాలంటూ కవిత సీబీఐ అధికారులను కోరారు. ఈ నెల 6న విచారణకు వివరణ ఇస్తానన్న కవిత.. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలు కావాలంటూ కోరారు.. కానీ దానికి సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. ఈ క్రమంలో కవిత సీబీఐ విచారణకు హాజరవుతారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

MLC కవిత రాసిన లేఖపై ఇంకా సీబీఐ స్పందించలేదు. సీబీఐ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య.. అధికారులు హైదరాబాద్‌కు చేరకున్నారు. వివరణ ఇచ్చేందుకు కవిత అడిగిన తేదీ ప్రకారం సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే, అంతకుముందే కవిత సీబీఐ విచారణకు హాజరు కాలేనని లేఖ కూడా రాశారు. కానీ అధికారులు మాత్రం ఇచ్చిన డేట్‌ ప్రకారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నలుగురు సభ్యులతో కూడిన బృందం సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకుంది. ఈ క్రమంలో కవిత విచారణకు హాజరవుతారా..? లేదా ..? అనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది. కోఠి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఢిల్లీ సీబీఐ అధికారులు.. ప్రశ్నలకు సంబంధించి పలు కాపీలను కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. సీబీఐ నిర్ణయం కోసం ఎమ్మెల్సీ కవిత ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రేపు సీబీఐ విచారణకు కవిత వెళ్తారా..? ఒకవేళ వెళితే.. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారనే దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం