పార్ట్ టైమ్ జాబ్‌ల పేరుతో వస్తున్న సందేశాలతో అప్రమత్తంగా ఉండండి.. ఆదమరిస్తే అంతే సంగతులు..
ఇటీవల కాలంలో డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి పెరిగింది. లివింగ్ ఆఫ్ కాస్ట్ పెరిగిపోవడం, దానికి తగిన ఆదాయం లేకపోవడంతో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు...
ఇటీవల కాలంలో డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి పెరిగింది. లివింగ్ ఆఫ్ కాస్ట్ పెరిగిపోవడం, దానికి తగిన ఆదాయం లేకపోవడంతో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చదువుకుంటున్నవారు కూడా పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని కొంతమంది పార్ట్ టైమ్ జాబ్స్ పేరిట స్కామ్‌కు తెరతీశారు. అవసరాన్ని ఆసరగా తీసుకుని దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మందికి సందేశాలు వస్తున్నాయి. పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఈ లింక్‌పైన క్లిక్ చేయండని మెసేజ్‌లో ఉంటుంది. లింక్ క్లిక్ చేసి డిటెయిల్స్ ఇచ్చినా, వారు చెప్పిన నెంబర్‌కు మెసెజ్ చేసినా తిరిగి కొంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటూ అడుగుతారు. ఒకే అని అమౌంట్ కట్టిన తర్వాత కూడా వారు జాబ్ ఇవ్వకపోవడం, ముందు ఇచ్చిన ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంటే కొంతమంది అవసరాన్ని ఆసరగా చేసుకుని డబ్బులు దోచుకోవడానికి పార్ట్ టైం జాబ్స్ పేరుతో స్కాంకు తెరలేపారు.
పైన చెప్పినది ఒక రకం అయితే ఇటీవల కాలంలో రోజుకు పది నిమిషాలు సమయం కేటాయిస్తే.. మీరు పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు ఆదాయం వస్తుందంటూ మోసాలకు దిగుతున్నారు కొంతమంది. వాస్తవానికి ఇది పూర్తిగా మోసపూరితమైన ప్రకటన. ఇటీవల కాలంలో కొంతమంది నేరగాళ్లు వందల కోట్ల రూపాయలను దోచుకున్నారు. దీనికి సంబంధించి ఎన్నో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఒక ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ యాప్‌లు (ఇవి ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండవు) తయారుచేయించి.. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, జాయినింగ్ బోనస్ వస్తుందని, వాటితో తాము ఇచ్చిన ఆర్డర్స్ సేల్ చేస్తే వెంటనే కమిషన్ వస్తుందంటూ నమ్మబలుకుతారు. కొద్ది రోజుల పాటు అమౌంట్ అకౌంట్‌లో జమచేస్తారు. నమ్మకం కుదిరి చాలా మంది డబ్బులు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో వేలు, లక్షల్లో పెట్టుబడులు పెడుతుంటారు.
ఇలా ఎక్కువ మంది నుంచి కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన తర్వాత.. వారికి అమౌంట్ అకౌంట్ లో వేయడం ఆపేస్తారు. అడిగితే టెక్నికల్ ఇష్యూ ఉంది రెండు రోజులు పడుతుందంటారు. తరువాత ఎటువంటి కమ్యూనికేషన్ ఉండడు. కొద్ది రోజులు తర్వాత తెలుస్తుంది. తాము మోసపోయామని.. అందుకే ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా లేకపోతే మాత్రం.. విలువైన నగదు పొగొట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం