స్థానిక ఆటగాళ్లను తీసుకోకపోతే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనివ్వం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

IPL 2021: ఐపీఎల్ 2021 మినీ వేలానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్...

స్థానిక ఆటగాళ్లను తీసుకోకపోతే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనివ్వం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

IPL 2021: ఐపీఎల్ 2021 మినీ వేలానికి సంబంధించి ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టీంలో స్థానిక ఆటగాళ్లు లేకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జట్టుకు మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికిన ఆటగాడు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడని.. స్థానిక ప్లేయర్స్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో స్థానిక ఆటగాళ్లను తీసుకోవాలని.. లేకపోతే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. జట్టులో హైదరాబాద్ ఆటగాళ్లకు స్థానం లేనప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ పేరు వెంటనే మార్చాలంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

కాగా, మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక్క హైదరాబాద్ ఆటగాడిని కూడా కొనుగోలు చేయలేదన్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ.. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఒక్క హైదరాబాదీ ప్లేయర్ లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని కామెంట్ చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(జట్టు): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, అబిషేక్ శర్మ, నబీ, సాహా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నదీమ్, గోస్వామి, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపి, విరాట్ సింగ్

 కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు: సుచిత్, కేదార్ జాదవ్, ముజీబ్ రెహమాన్

Published On - 1:33 pm, Sat, 20 February 21

Click on your DTH Provider to Add TV9 Telugu