Telangana: గ్యాస్ ధరల పెంపుపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. రోడ్లపై కట్టెల పొయ్యితో నిరసనలు..

Telangana: కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని

Telangana: గ్యాస్ ధరల పెంపుపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. రోడ్లపై కట్టెల పొయ్యితో నిరసనలు..
Protest
Follow us

|

Updated on: Jul 07, 2022 | 6:04 PM

Telangana: కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చారు. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ లో మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మహిళలు రోడ్లపైకి వచ్చి ఖాళీ సిలిండర్ల ముందు కూర్చుని.. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గృహా అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 మేర ఇష్టం వచ్చినట్లు పెంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలతో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వీడి కట్టెల పొయ్యిని ఎంచుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పెంచిన గ్యాస్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. బీజేపీ పాలనలో పెట్రోలు, డీజీల్‌ ధరలు పెంచుతూ ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని, రాబోయే రోజుల్లో మోడీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలోనూ.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు మహిళలు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరయ్యారు. రోడ్డుపై కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి వంట చేసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..