AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: లారీ డ్రైవర్ మద్యం మత్తు.. ఐదుగురి ప్రాణాలు తీసింది..

ఒక డ్రైవర్‌ తాగుడు, అతివేగం ఐదుగురి ప్రాణాలు తీసింది. ఇవాళ వరంగల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోలపై బోల్తా పడడంతో ఈ ఘోరం జరిగింది. లారీ డ్రైవర్ పీకలదాకా మద్యం తాగి, అతి వేగంగా లారీ నడపడమే యాక్సిడెంట్‌కి కారణమని గుర్తించారు.

Warangal: లారీ డ్రైవర్ మద్యం మత్తు.. ఐదుగురి ప్రాణాలు తీసింది..
Road Accident
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 26, 2025 | 2:15 PM

Share

వరంగల్ శివారు ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై మామునూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోల పైన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా ముగ్గురు క్షతగాత్రులు మృత్యువుతో పోరాడుతున్నారు.. డ్రైవర్ పీకల దాకా మద్యం సేవించి లారీ నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.. మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

పొట్టకూటి కోసం ఓరుగల్లుకు వలస వచ్చిన కూలీలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. మద్యం మత్తులో లారీ నడిపిన ఓ మూర్ఖుడు  ఐదుగురి ప్రాణాలను మింగేశాడు.. అతివేగంతో లారీ నడిపి ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు.. ఈ ప్రమాదం వరంగల్ శివారులోని మామునూరు సమీపంలో జరిగింది.. వైజాగ్ నుండి ఐరన్ లోడ్‌తో వెళుతున్న లారీ అతివేగంగా ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టింది.. సడన్ బ్రేక్ వేయడంతో ఆ లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న ఐరన్ పోల్స్ ఆటోలపై పడ్డాయి..

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. మరొక బాలుడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు.. మృతులు అంతా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్‌కు చెందినవారుగా గుర్తించారు.. వరంగల్ శివారులో గుడారాలు వేసుకొని నివాసం ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారంతా ఆటోలో వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ఫుల్‌గా మద్యం సేవించిన లారీ డ్రైవర్… మార్గమధ్యలో పంతిని సమపంలో ఒక ఆటను వెనుక నుండి ఢీకొట్టాడు. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు. అయిేనప్పటికీ అదే మత్తులో అతను లారీని నడిపి.. మామునూరు వద్ద యాక్సిడెంట్ చేయడంతో.. ఐదరుగురు చనిపోయారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోయిన ఐరన్ పోల్స్‌ను భారీ క్రేన్ల సహాయంతో తొలగించి లారీని అక్కడి నుండి పక్కకు తొలగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..