గిరిజన మహిళ ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ సిబ్బంది వంటావార్పు.. ఎందుకో తెలుసా?
జనగామ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్వాక్రా గ్రూపు ద్వారా అప్పు తీసుకున్న గిరిజన మహిళ, ఆర్థిక ఇబ్బందులతో తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి ముందు నిరసన తెలిపారు. అంతేకాదు ఏకంగా ఆమె ఇంటి ముందు పొయ్యి పెట్టి, వంటావార్పు నిర్వహించారు. ఇందుకు సంబంధించి వీడియో తీసి గ్రామానికి చెందిన గ్రూపుల్లో షేర్ చేశారు.

వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టి పారిపోయిన పెద్దలను పట్టుకోలేని బ్యాంకులపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇం కోవైపు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి రైతులకు రుణమాఫీ చేస్తోంది. కానీ కడు పేదరికానికి చెందిన ఓ గిరిజన మహిళ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు సిబ్బంది పరువు బజారుకిడ్చారు. డ్వాక్రా గ్రూపు మహిళలతో కలిసి వచ్చి గిరిజన మహిళ ఇంటి ముందు పొయ్యి పెట్టి పరువు తీశారు. వాళ్ల దయనీయ పరిస్థితి చూడలేక ఓ గిరిజనుడు ఆ అప్పుకు జమానత్ పడడంతో చివరికి వదిలేశారు.
ఈ సంఘటన జనగామ జిల్లా దేవరప్పుల మండలం పెద్ద తండాలో జరిగింది. గుగులోతు లక్ష్మీ అనే గిరిజన మహిళ గ్రామంలోని మహిళా సంఘం ద్వారా తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో రుణం తీసుకుంది. మొత్తం 61 రూపాయలు రుణం తీసుకుని కొంత మొత్తం చెల్లించింది. ప్రస్తుతం వడ్డీతో సహా 28వేల రూపాయల బకాయి పడింది. చాలా రోజుల నుండి అప్పు తిరిగి చెల్లించడం లేదు. చెల్లించలేని దయనీయ స్థితిలో ఉండటంతో చేతులెత్తేసింది. ఈ క్రమంలో డ్వాక్రా గ్రూపు మహిళలు బ్యాంకు సిబ్బంది ఆ అప్పు వసూలు కోసం మానవత్వం మరిచి కర్కశంగా ప్రవర్తించారు. ఏకంగా ఆ గిరిజన మహిళ ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు ప్రయత్నం చేశారు. ఆ గిరిజన మహిళ పరువు తీశారు. ఆ సమయంలో ఊరంతా అప్పు కోసం తిరిగిన ఎవరు చిల్లి గవ్వ ఇవ్వని దయనీయ పరిస్థితి తీసుకొచ్చారు.
అంతేకాదు ఆమె ఇంటి ముందు కూర్చుని హంగామా చేశారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లిస్తే తప్ప అక్కడ నుండి వెళ్ళమని అక్కడే కూర్చున్నారు. పైగా ఈ వ్యవహారం అంతా వీడియో చిత్రీకరించి ఆ ఊరి వాట్సప్ గ్రూప్ లలో పోస్ట్ చేశారు. గిరిజన మహిళ పరువు బజార్ కిడ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ముందుకు వచ్చి కొంత సమయం అడిగారు. ఆలోపే వారు చెల్లించని పరిస్థితుల్లో తాను చెల్లిస్తానని జమానత్ ఇవ్వడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ వ్యవహారం అంతా ఆ బ్యాంకు సిబ్బంది వీడియో చిత్రీకరించి గ్రామంలోని వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసి ఆ గిరిజన మహిళ పరువు బజార్ కిర్చారు. బ్యాంకు సిబ్బంది అప్పు వసూలు కోసం ఇంత కర్కషంగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




