Manikrao Thakre: కాంగ్రెస్‌లో పరిస్థితులు మారేనా..? హైదరాబాద్‌కు టీపీసీసీ కొత్త ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రే..

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ బాస్ మానిక్ రావ్ థాక్రే ఈ నెల 11న హైదరాబాద్ రానున్నారు. రేవంత్ వర్సస్ పాత నేతలు అన్నట్టు మారిన తెలంగాణ కాంగ్రెస్‌ని చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించనున్నారు.

Manikrao Thakre: కాంగ్రెస్‌లో పరిస్థితులు మారేనా..? హైదరాబాద్‌కు టీపీసీసీ కొత్త ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రే..
Telangana Congress
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2023 | 6:48 AM

తెలంగాణలో మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే దూసుకెళ్ళుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తాకిడిని తట్టుకునేందుకు టీపీసీసీ కూడ సిద్దం కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట వ్యవహారాల నూతన ఇంఛార్జ్ మానిక్ రావ్ థాక్రే రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దే బాధ్యత హైకమాండ్ ఆయనకు అప్పగించింది. రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారని.. పార్టీ గురించి ఆలోచించటం లేదంటూ మాజీ ఇంఛార్జ్ ఠాగూర్ పైన ఫిర్యాదుతో హైకమాండ్ ఆయన్ను తప్పించింది. కొత్తగా నియమితులైన థాక్రే కాంగ్రెస్ రాజకీయాల్లో తల పండిన నేత. రెండు రోజుల పాటు థాక్రే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.

11వ తేదీ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడుతో థాక్రే ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని నిర్ణయించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సమావేశం తరువాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశానికి నిర్ణయించారు. ఇద్దరి నాయకత్వం రాష్ట్ర పార్టీకి కీలకం కావటంతో..ఆ ఇద్దరితో సమావేశం తరువాత మిగిలిన నేతలతో భేటీ కానున్నారు. ఆ వెంటనే సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లతో సమావేశానికి నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు.. పిసీసీ అధికార ప్రతినిధులతోనూ సమావేశానికి నిర్ణయించారు.

రెండో రోజు పర్యటనలో డీసీసీ అధ్యక్షులో రాష్ట్ర ఇంఛార్జ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనుబంధ సంఘాల నేతలను ఆహ్వానించారు. ఆ తరువాత పార్టీ నేతలతో ముఖాముఖి సమావేశాలకు నిర్ణయించారు. పూర్తిగా రాష్ట్రంలో పరిస్థితులను ఆరా తీయటం.. అధ్యయనం చేయటం పైనే తొలి విడత పర్యటన ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..
రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..
అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..
అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..
భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!
భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!