AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ మార్క్ రాజకీయం మొదలైందా? రాజీనామాల వెనుక స్ట్రాటజీ ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ మార్క్ రాజకీయం మొదలైందా? కమిటీల్లో పేర్లపై తిరుగుబాటు చేసిన సీనియర్లకు తనదైన స్టయిల్‌లో చెక్‌పెట్టారా? తన టీమ్‌ మెంబర్స్‌తో రాజీనామాలు చేయించడం..

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ మార్క్ రాజకీయం మొదలైందా? రాజీనామాల వెనుక స్ట్రాటజీ ఏంటి?
Revanth Reddy Padayatra
Shiva Prajapati
|

Updated on: Dec 18, 2022 | 11:03 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ మార్క్ రాజకీయం మొదలైందా? కమిటీల్లో పేర్లపై తిరుగుబాటు చేసిన సీనియర్లకు తనదైన స్టయిల్‌లో చెక్‌పెట్టారా? తన టీమ్‌ మెంబర్స్‌తో రాజీనామాలు చేయించడం అందులో భాగమేనా? జీ-9 నేతలకు ముందు ముందు రేవంత్ ఎలా కౌంటర్‌ ఇవ్వబోతున్నారు? వలస నేతలకు ప్రాధాన్యంపై అభ్యంతరం.. సేవ్ కాంగ్రెస్‌ నినాదంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు సీనియర్లు. నిన్న మొన్న వచ్చినోళ్లకు పెద్దపీట వేసి మొదటినుంచి పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నవాళ్లకు మొండిచేయి చూపిస్తారా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మ్యాటర్ ఇంతటితో వదిలేదే లే.. అధిష్టానం దగ్గర పంచాయితీ పెట్టి తేల్చేసుకుంటామన్నారు.

సమావేశానికి హాజరుకావాలని సమాచారం..

అధిష్టానానికి వీరవిధేయులుగా ఉండేవాళ్ల స్వరం మారడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. అందులోభాగంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరుకావాలని సీనియర్లకు సమాచారమిచ్చారు. కానీ వాళ్లెవరూ హాజరుకాలేదు. ఈ క్రమంలోనే వలస నేతలంటూ ప్రచారం జరుగుతున్న 13మంది నేతలు రాజీనామా చేశారు.

సీనియర్లకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ..

నిజానికి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొద్దిమందికి మాత్రమే కొత్త కమిటీల్లో చోటు దక్కింది. వాటిపై సీనియర్ల అభ్యంతరాలతో దక్కిన పదవుల్ని వదులుకున్నారు 13మంది నేతలు. ఇది అనూహ్య పరిణామంగా అందరూ భావిస్తున్నప్పటికీ.. సీనియర్లకు చెక్ పెట్టేందుకే రేవంత్ వర్గం పన్నిన వ్యూహాత్మక ఎత్తుగడగా తెలుస్తోంది. అలాగే పదవులు వచ్చింది 54 మంది కాదు.. కేవలం 13మందికేనని క్లారిటీ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే రేవంత్‌ వర్గీయులు మాత్రం సంక్షోభం కొనసాగడం ఇష్టం లేకే రాజీనామా చేశామంటున్నారు. ఇక జరుగుతున్న పరిణామాలపై సీనియర్‌ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకంటే సీనియర్లు ఎవరని ప్రశ్నిస్తూనే హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనన్నారు.

రాజీనామాలతో సంక్షోభానికి తెరపడుతుందా?

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశానికి ముందు సీనియర్లకు రేవంత్ ఝలక్ ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. ప్రస్తుత సంక్షోభానికి వలస నేతల రాజీనామాలతో తెరపడుతుందా? సేవ్ కాంగ్రెస్ పేరుతో సీనియర్ల తిరుగుబాటు కొనసాగుతుందా? అసలు హైకమాండ్‌ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us